పుట:Hello Doctor Final Book.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33. రక్షణ వికటత్వము (Anaphylaxis) జీవరాశులు అన్నీ యితరజీవులు, జీవాంశముల ఆక్రమణకు గురి అవుతుంటాయి. అందువలన అవి స్వరక్షణకు బయట, లోపల కూడా రక్షణవ్యవస్థలను వృద్ధిచేసుకుంటాయి. జంతువులు, పక్షుల  రక్షణ వ్యవస్థలలో రక్షకకణములు, రక్షకస్రావకములు, రసిగ్రంథులు (lymph glands, ప్లీహము (spleen) ముఖ్యపాత్రను నిర్వహిస్తాయి.

విషజీవాంశములు (viruses), సూక్ష్మజీవులు (bacteria), పరాన్నభుక్తులు (parasites), సొంత దేహమునకు చెందని మాంసకృత్తులు (foreign Proteins), శర్కరమాంసకృత్తులు (glycoproteins) వంటి  పదార్థములు  దేహము లోనికి చొచ్చుకొన్నపుడు అవి రక్షణ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. రక్షణవ్యవస్థ స్పందనము వలన ప్రతిరక్షకములు ( antibodies) ఉత్పత్తి అవుతాయి. ప్రతిరక్షకముల ఉత్పత్తిని ప్రేరేపించు పదార్థములు ప్రతిజనకములుగా (antigens) వ్యవహరింపబడుతాయి. దేహము  రక్షణకణములతోను, ప్రతిరక్షకములు (antibodies) తోను, ఇతర రక్షణస్రావకముల తోను దాడిని ప్రతిఘటించి, దాడి సలిపే సూక్ష్మజీవులను చంపుటకు, విషజీవాంశములను (viruses), విషపదార్థములను తటస్థీకరించుటకు యత్నము చేస్తుంది. శరీరరక్షణకు ఈ ప్రక్రియ అవసరము. కాని ప్రతిజనకములకు (antigens) ప్రతికూలముగా  రక్షణవ్యవస్థ  స్పందించుట వలన దేహమునకు ఒక్కొక్కసారి ప్రతికూల ఫలితములు  కలుగ వచ్చును. వీటిలో అసహనము (allergy) వివిధ స్థాయిలలో ఉండవచ్చును.

రక్షణవ్యవస్థ ప్రతిస్పందన వలన తీవ్రపరిణామములు త్వరగా వాటిల్లి రక్షణవికటత్వము (anaphylaxis) కలుగవచ్చును. తీవ్ర రక్షణవికటత్వమును (anaphylaxis) అత్యవసర పరిస్థితిగా పరిగణించి చికిత్స

354 ::