పుట:Hello Doctor Final Book.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

receptors  ) అవరోధిస్తుంది. ప్రతిజనక రక్షక చికిత్స ( allergen immunotherapy AIT ) :

పుప్పొడి (pollen), శిలీంధ్రబీజములు (fungal spores), ధూళిక్రిములు (dust mites) వంటి ప్రతిజనకములకు (antigens) ప్రతిరక్షకము - ఇ ల (immunoglobulin E ) ద్వారా అసహనములు కలుగుచున్నట్లు నిరూపణ అయితే, ఆ యా ప్రతిజనకములను (antigens) నోటిలో నాలుక క్రిందకాని, చర్మముక్రింద సూదిమందుగా గాని

అనుభవజ్ఞులయిన వైద్యుల పర్యవేక్షణలో చాలా తక్కువ మోతాదులలో మొదలుపెట్టి క్రమముగా మోతాదులను  పెంచి ఇస్తూ, సహనమును (tolerance) పెంపొందించవచ్చును. రక్షణ వికటత్వము (anaphylaxis) కలిగితే చికిత్సకు సిద్ధపడాలి.

353 ::