పుట:Hello Doctor Final Book.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కార్టి కోష్టీ రాయిడులు ( Corticosteroids ) :

అసహనము వలన కలిగే నాసికాతాపములు తీవ్రముగా ఉన్నపుడు, దీర్ఘకాలము ఉన్నపుడు,మిగిలిన ఔషధములకు తగ్గనపుడు వాటి నివారణకు స్థానికముగా పనిచేసే కార్టికోష్టీరాయిడులు (locally acting corticosteroids) తుంపర మందులుగా వాడవచ్చును. బెక్లోమిథసోన్  (beclomethasone), ఫ్ని లు సొలైడ్ (flunisolide), మోమెటసోన్ (mometasone), ఫ్లుటికసోన్ (fluticasone), ట్రయామ్ సినొలోన్ (triamcinolone), బ్యుడిసొనైడ్ (budesonide) లు తుంపరమందులుగా వాడుకలో ఉన్నాయి. ఈ మందులు ముక్కు శ్లేష్మపు పొర (mucosa) ఉపరితలముపై పనిచేస్తాయి. వీటి వలన శరీరము అంతటా అవాంఛిత ఫలితములు కలుగవు. త్వరగా విచ్ఛేదనము పొందుతాయి. వీటి ఫలితములు కనిపించుటకు కొద్ది దినములు పడుతుంది. ఋతు అసహనముల నివారణకు వీటిని ఋతుకాలము అంతా పూర్తిగా వాడుట మేలు.

వీని వాడకము వలన తుమ్ములు, ముక్కు మంట, ముక్కునుంచి రక్తస్రావము (epistaxis) వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. అరుదుగా  శ్లేష్మపుపొరలో (mucosa) మధుశిలీంధ్ర తాపము (Candidial infection),  శ్లేష్మపుపొర పుండుపడుట కలుగవచ్చును. తాపలక్షణముల తీవ్రత అధికముగా ఉన్నపుడు ప్రెడ్నిసోన్ (prednisone) నోటిద్వారా నియమిత కాలము వాడవచ్చు. ఎక్కువ దినములు వాడితే శరీరములో అవాంఛిత ఫలితములు కలిగే అవకాశములు హెచ్చు. సూదిమందుగా ట్రయామ్సినొలోన్ (triamcinolone), బీటామిథసోన్ లు (betamethasone) వాడవచ్చును. వీటి ఫలితములు అల్పకాలమే ఉంటాయి. తఱచు వాడితే అవాంఛిత ఫలితములు కలిగే అవకాశములు పెరుగుతాయి. ఇప్రట్రోపియమ్ బ్రోమైడు ( Ipratropium bromide ) :

దీనిని తుంపరమందుగా ముక్కు నుంచి నీరుకారుటను నివారించుటకు వాడవచ్చును. ఇది ఎసిటైల్ ఖొలీన్  గ్రాహకములను (acetyl choline

352 ::