పుట:Hello Doctor Final Book.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఔషధములు : హిష్ట మిన్ గ్రాహక అవరోధకములు ( Histamine receptor blockers

antihistamines )

అసహన నాసికాతాపములను అరి కట్టుటకు హిష్టమిన్ అవరోధకములను (Histamine receptor blockers) విరివిగా ఉపయోగిస్తారు. అవసరమయినపుడు వీటిని ప్రతిజనకములు (antigens) పీల్చుటకు ముందే తీసుకోవాలి. నిర్ణీత సమయములలో వీటిని  క్రమము తప్పక తీసుకొని అసహన నాసికాతాపములను (allergic rhinitis) చాలా వఱకు నివారించవచ్చును.

ఇవి ముక్కులో దురద, నీరుకారుట (rhinorrhoea), తుమ్ములు, వంటి బాధలను నివారిస్తాయి. ఎజెలాష్టిన్ ( azelastine ) తుంపర మందుగా లభ్యము. ముక్కులోపలి గోడలపై యీ మందును తుంపరులుగా చల్లుకుంటే గంటలో ఉపశమనము కలుగవచ్చును. కంటి పైపొరలో అసహన తాపలక్షణములు ( allergic conjunctivitis) కలిగితే కంటిలో ఎజెలాష్టిన్ ను చుక్కలమందుగా వాడవచ్చును.

అనేక హిష్టమిన్ గ్రాహక అవరోధకములు (Histamine receptor blockers) నోటిద్వారా తీసుకొనుటకు  లభ్యము. డైఫెన్ హైడ్రమిన్ (diphenhydramine) వంటి మొదటి తరము హిష్టమిన్ గ్రాహక అవరోధకములు మెదడుకు కూడా చేరుట వలన వాటివలన కొందఱిలో మత్తు, నిద్ర, నిద్రలేమి ( insomnia), కళ్ళుతిరుగుట వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. సెట్రిజిన్ ( cetrizine ), లొరాటడిన్ (loratadine) వంటి రెండవ తరము మందుల వలన మత్తు కలిగే అవకాశములు తక్కువ. ఇవి మెదడుకు చేరవు.

ఈ మందుల వలన మసక చూపు, నోరు పిడచకట్టుట,  మూత్రవిసర్జన అలసత్వము వంటి అవాంఛిత ఫలితములు కలుగ వచ్చును.

350 ::