పుట:Hello Doctor Final Book.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(antigens ) నిలిపి చర్మపు స్పందనముల (  దద్దురు - ఎఱుపు - wheal and flare ) బట్టి ఏ ప్రతిజనకములకు ( antigens ) అసహనములు (allergies) ఉన్నవో నిర్ణయించవచ్చును. లోచర్మపు పరీక్షలు ( intra dermal tests ) :

పైచర్మపు పరీక్షలలో చర్మము స్పందించక పోయినా, లేక స్పందన తక్కువగా ఉన్నా, వినీల ప్రతిజనకములను లోచర్మములో (Intra dermal)  సూదితో నిలిపి స్పందన బట్టి అసహనములను నిర్ణయించవచ్చును. కాని ఈ పరీక్షలలో అసహనములు కలవారిలో ప్రమాదకర రక్షణ వికటత్వము  (anaphylaxis) కలిగే అవకాశము హెచ్చు. ఈ పరీక్షల వాడుక అరుదు. అంటింపు పరీక్షలు ( patch tests ) :

ప్రతిజనకములు (antigens) కల పత్రములను నడ్డిపై  చర్మమునకు అంటించి చర్మపు స్పందనను రెండుదినములు, నాలుగుదినములలో పరిశీలించి అసహనములను నిర్ణయించవచ్చును. తొలగింపు / సవాలు పరీక్షలు ( Elimination / challenge tests ) :

ఆహారపదార్థములకు, ఔషధములకు, యితర పదార్థములకు అసహనములను అనుమానించినపుడు ఆ పదారము ్థ లను పూర్తిగా తొలగించి, అసహన లక్షణములు పూర్తిగా తగ్గిపోయాక, ఒక్కొక్క పదారము ్థ ను తర్వాత  చేర్చి ఆ పదార్థము వలన అసహనము కలిగిందో లేదో నిర్ధారించవచ్చును.

అసహనములకు పరీక్షలు  వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా చెయ్యాలి. రక్షణ వికటత్వము (anaphylaxis) వంటి విపరీత పరిణామములను ఎదుర్కొనుటకు  వైద్యులు సంసిద్ధులై ఉండాలి. ఇతర నాసికాతాపములు ( Rhinitis from other causes ) :

విషజీవాంశములు (viruses), సూక్ష్మజీవుల వలన కలిగే జలుబు, నాసికాతాపములు తఱచు కాక అప్పుడప్పుడే కలుగుతాయి. వీటిలో తుమ్ములు కంటె ముక్కు కారుట ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు,

348 ::