పుట:Hello Doctor Final Book.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధి నిర్ణయము :

ఋతు అసహనములు (seasonal allergies) నిర్ణీత ఋతువులలో చెట్లు, మొక్కలు, గడ్డి పుష్పించునపుడు కలుగుతాయి. ముక్కులో దుఱద, ఎక్కువగా తుమ్ములు, కళ్ళలో దుఱద, కళ్ళు నీరుకారుట వంటి లక్షణములు, ముక్కు నుంచి స్రావకములు పలుచగా ఉండుట అసహనములను (allergies) సూచిస్తాయి. ధూళివలన కలిగే అసహన లక్షణములు ధూళి సోకగానే కనిపిస్తాయి. పరీక్షలు :

నాసికా స్రావకములను గాజు పలకపై పూతగా పూసి, తగిన వర్ణకములతో (Wright’s stain) సూక్ష్మదర్శినితో పరీక్షించినపుడు ఆమ్లాకర్షణ కణములు (eosinophils) గుమికూడి కనిపించవచ్చును. కనిపించిన శ్వేతకణములలో 10 శాతముమించి ఆమ్లాకర్షణ కణములు ఉంటే అసహనమును సూచిస్తాయి. రక్తపరీక్షలో ఆమ్లాకర్షణ కణములు 10 శాతము మించి ఉండవచ్చును. ఘన మిల్లీ మీటరు రక్తములో ఆమ్లాకర్షణ కణములు 700 మించి ఉండవచ్చును.

రక్తద్రవములో ( plasma ) ప్రతిరక్షకము - ఇ ( Immunoglobulin E) ప్రమాణములు అసహనములు కలిగినపుడు, ఉబ్బస వ్యాధిలోను, దేహములో పరాన్నభుక్తులు చేరినపుడును  హెచ్చుగా ఉంటాయి. కొన్ని నిర్ణీత ప్రతిజనకములకు (specific antigens)  నిర్దిష్ట ప్రతిరక్షకములు - ఇ లను (specific IgE s ) రక్తద్రవములో వివిధ పరీక్షల ద్వారా కనుగొని  ఏ ప్రతిజనకములకు (antigens) అసహనములు ఉన్నవో నిర్ణయించవచ్చును.  ఈ పరీక్షలలో వ్యాధిగ్రస్థులకు ఎట్టి ప్రమాదము కలుగదు. పై చర్మపు పరీక్షలు ( epicutaneous tests ) : పైచర్మములో సూదులతో

వివిధ  విలీన

347 ::

ప్రతిజనకములను