పుట:Hello Doctor Final Book.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవి త్వరగా నేలపైకి రాలిపోతాయి. గాలిచే పరాగసంపర్కము చెందే  పూలపుప్పొడులు తేలికగా ఉండి గాలితో ఎగురుకొని ముక్కులోనికి శ్వాసపథములోనికి చొచ్చుకొనగలుగుతాయి. మొక్కలు, చెట్లు, పుష్పించు కాలము బట్టి ఆ యా అసహనములు (allergies), వాటివలన నాసికా తాపములు (rhinitis) కలుగుతాయి. వార్షిక అసహనములు ( perennial allergies )

ధూళిక్రిములు (dust mites), పెంపుడు జంతువుల శిథిలకణములు (animal dander), ఇళ్ళలో వసించు బొద్దింకలు, యితర కీటకముల విసర్జనలు, ఇళ్ళలో ఉండే శిలీంధ్రముల వలన సంవత్సర మంతా అసహనములు కలిగి నాసికాతాపము (rhinitis) కలుగవచ్చును. వ్యాధి విధానము ( Pathogenesis )

నాసికాతాపము కలిగించే పరాగములు (pollen ), ధూళిక్రిముల వంటి తాపజనకములు ప్రతిజనకములుగ (antigens) శరీరము లోనికి ప్రవేశించి శరీరరక్షణ వ్యవస్థను ప్రేరేపించి ప్రతిరక్షకములు (antibodies) ఇమ్యునోగ్లాబ్యులిన్- ఇ  (Immunoglobulin- E ) ల ఉత్పత్తికి  కారణము అవుతాయి. ఈ ఇమ్యునోగ్లాబ్యులిన్ - ఇ ముక్కు శ్లేష్మపుపొరలోను (mucosa) శ్వాసపథ శ్లేష్మపు పొరలోను ఉండే స్తంభకణములతో (mast cells) సంధానమవుతాయి. ప్రతిజనకములు (antigens) మఱల ముక్కు, శ్వాసపథముల లోనికి ప్రవేశించినపుడు  అవి శ్లేష్మపుపొరలోనికి చొచ్చుకొని అచ్చటి స్తంభకణములకు అంటుకొని ఉన్న ఇమ్యునోగ్లోబ్యులిన్ - ఇ (immunoglobulin - E) ప్రతిరక్షకములతో  కూడుకొని స్తంభకణముల నుంచి హిష్టమిన్ (histamine), లూకోట్రయీన్స్ (leukotrienes),  ప్రోష్టాగ్లాండిన్స్ (prostaglandins), కైనిన్స్ ( Kinins ) వంటి తాపము కలిగించే రసాయనముల విడుదలకు కారణము అవుతాయి. వాటివలన రక్తనాళములు వ్యాకోచము చెందుతాయి. కేశరక్తనాళికలలో పారగమ్యత (capillary permeability ) పెరుగుతుంది. శ్లేష్మపుపొర

345 ::