పుట:Hello Doctor Final Book.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32.అసహన నాసికా తాపము ( Allergic Rhinitis )

ముక్కుతోడ మున్ను మూర్కొన్న నవపుష్ప                                    రజము మిక్కుటముగ  రట్టు సేసె ;

వచ్చుననగ రాదు, వారింపగా పోదు, తుమ్ము;  దాని సొమ్ము వమ్ము గాను!

( మూర్కొను = వాసన చూచు ; రజము = పుప్పొడి ; రట్టు = అలజడి, చికాకు ; వమ్ము = వ్యర్థము ) వివిధపదార్థముల వలన  అసహనములు (allergies) కలిగి  ముక్కులో తాపము కొన్ని ఋతువులలో కాని లేక సంవత్సరము పొడవునా కాని కలుగవచ్చును. ఋతు అసహనములు ( Seasonal allergies ) :

పూల పుప్పొడులు (pollen), శిలీంధ్రబీజములు (fungal spores), గాలిద్వారా ముక్కులోనికి ప్రవేశించినపుడు  వాటికి అసహనము (allergy) కలవారిలో తాపలక్షణములు కలుగుతాయి. కీటకములద్వారా పరాగసంపర్కము జరిగే పూలపుప్పొడుల పరిమాణము హెచ్చుగా ఉండుటచే

344 ::