పుట:Hello Doctor Final Book.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపూరక వ్యవస్థ (Complement system) :

శరీరరక్షణలో ప్రతిరక్షకములతో (antibodies) బాటు సంపూరక వ్యవస్థ (Complement system) ప్రముఖపాత్ర వహిస్తుంది. సంపూరక వ్యవస్థలో కణద్రవములో ఉండే కొన్ని మాంసకృత్తులు, శర్కర మాంసకృత్తులు (glycoproteins), కణముల పొరలపై ఉండే గ్రాహకములు (receptors) పాలుపంచుకుంటాయి. ఈ సంపూరకములు శరీరముపై దాడిచేసే సూక్ష్మాంగజీవుల భక్షణకు (phagocytosis), సూక్ష్మజీవుల కణకుడ్యముల విధ్వంసమునకు (cell wall destruction), తాప ప్రక్రియను ప్రోత్సహించి భక్షక కణములను (phagocytes) ఆకర్షించుటకు సహాయపడతాయి.

సంపూరకములు (complements) సూక్ష్మజీవులకు అంటుకొని తదుపరి భక్షకకణముల గ్రాహకములతో  (receptors of phagocytes) సంధానమవుతాయి. అప్పుడు భక్షకకణములు ఆ సూక్ష్మజీవులను భక్షించి వాటిని ధ్వంసము చేస్తాయి. ఇవి తాప ప్రక్రియను ప్రోత్సహించి భక్షకకణములను (phagocytes) రోగజనకముల (pathogens) దగ్గఱకు ఆకర్షిస్తాయి.

సంపూరకములు (complements - c5b, c6, c7, c8, c9) వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల కణముల పొరలపై పరంపరముగా సంధానమయి కణవేష్టన ఆక్రమణ వ్యవస్థలను (membrane attack complexes- MACs) ఏర్పరుస్తాయి. ఈ కణవేష్టన ఆక్రమణ వ్య (MACs) సూక్ష్మజీవుల కణముల పొరలలో చిల్లులు పొడిచి సూక్ష్మజీవులను ధ్వంసము చేస్తాయి. సంపూరకములు విషజీవాంశముల (viruses) ధ్వంసములో కూడా తోడ్పడుతాయి. దేహములో రక్షణ వ్యవస్థ సక్రమముగా పనిచేయుట వలన శరీరము అనేక వ్యాధుల నుంచి సహజముగా కోలుకోగలుగుతు ఉంటుంది. సూక్ష్మాంగ

342 ::