పుట:Hello Doctor Final Book.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇవి ప్రాధమిక రక్షణలో పాల్గొంటాయి. ఇవి పరిమాణములో పెద్దవి. ప్రతిజనకములతో (antigens) కలిసి గుమికట్టి (agglutination) వాటి విచ్ఛేదనమునకు తోడ్పడుతాయి. ప్రతిరక్షకము ఎ (immunoglobulin A, IgA) :

ఇవి శ్లేష్మపు పొరలలో (mucosa) ఉండి శ్లేష్మపు పొరలకు రక్షణ సమకూర్చుతాయి. ఇవి శ్వాసమార్గము, జీర్ణమండలము, మూత్ర మార్గములకు రక్షణ ఇస్తాయి. కన్నీరు, లాలాజలము, క్షీరము వంటి బహిస్స్రావకములలో కూడా ప్రతిరక్షకము ఎ (IgA) లు ఉండి ప్రతిజనకములను ఎదుర్కొంటాయి. ప్రతిరక్షకము డి (Immunoglobulin D, IgD) :

ఇవి రక్తములో తక్కువ ప్రమాణములలో ఉంటాయి. బి రసికణములపై (B Lymphocytes) ఉండి ప్రతిజనకములకు గ్రాహకములుగా (receptors) పనిచేస్తాయి. ఇవి క్షారాకర్షణ కణములను (basophils), స్తంభకణములను (mast cells) ఉత్తేజపరచి సూక్ష్మజీవులను విధ్వంసపఱచే రసాయనములను విడుదల చేయిస్తాయి. ప్రతిరక్షకము ఇ (Immunoglobulin E, IgE) :

ఇవి రక్తములో తక్కువ పరిమాణములో ఉంటాయి. అసహనములు (atopy and allergy) కలవారిలో వీటి ప్రమాణము అధికమవవచ్చును. ప్రతిజనకములు (antigens) శరీరములో ప్రవేశించినపుడు ఇవి ఉత్పత్తి చెంది క్షారాకర్షణ కణములకు (basophils), స్తంభకణములకు (mast cells) అంటుకొని ఉంటాయి. ప్రతిజనకములు మఱల శరీరములో ప్రవేశించినపుడు వాటితో సంధానమయి ఆ కణముల నుంచి హిష్టమిన్ (histamine), leukotrienes, interleukins వంటి తాప జనకములను విడుదలను చేయిస్తాయి. ఇవి పరాన్నభుక్తులను ఎదుర్కొనుటకు సహాయపడతాయి. ఇవి అసహనము (allergy), రక్షణ వికటత్వము (anaphylaxis) కలిగించుటలో  పాత్ర వహిస్తాయి.

341 ::