పుట:Hello Doctor Final Book.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెప్టైడుల (పెప్టైడులు ఎమైనో ఆమ్ల సంధానము వలన ఏర్పడుతాయి.) సముదాయములను కలిగి ఉంటాయి.

క్షీరదములలో ప్రతిరక్షకములను ఐదు తరగతులుగా విభజించవచ్చును. ప్రతిరక్షకము G (immunoglobulin G, IgG) :

ఇవి ప్రతిజనకము శరీరములో చొచ్చుకొన్న 10- 14 దినముల పిదప ఉత్పత్తి అవుతాయి. అందువలన ఇవి  ద్వితీయ రక్షణలో (secondary immunity) పాల్గొంటాయి. భవిష్యత్తులో శరీరము ప్రతిజనకముల పాలయినప్పుడు జ్ఞాపక కణములచే (memory B cells) ఇవి విరివిగా ఉత్పత్తి అయి స్ఫురణ రక్షణప్రక్రియకు (recall immunity) తోడ్పడుతాయి. ప్రతిరక్షకములు జి లు (IgG) పరిమాణములో చిన్నవి, కణజాలము మధ్యకు చొచ్చుకొని ప్రతిజనకములను (antigens, వ్యాధికారకములు, pathogens) నిర్మూలించుటకు తోడ్పడుతాయి. ప్రతిరక్షకము ఎమ్ (immunoglobulin M - IgM) :

ప్రతిజనకములు శరీరములో చొచ్చుకున్నపుడు తొలి దినములలో ప్రతిరక్షకము ఎమ్ (IgM) లు ఉత్పత్తి అవుతాయి. అందువలన

340 ::