పుట:Hello Doctor Final Book.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రసికణములు (T- Lymphocytes), ఏకకణములు (monocytes ) విడుదల చేయు సైటోకైన్లు (cytokines ) బి రసికణముల సమరూప వృద్ధిని (cloning) ప్రేరేపిస్తాయి.

ఈ బి రసికణములు (B - Lymphocytes) స్రావకకణములుగా (plasma cells) మార్పు చెందుతాయి. సమరూప స్రావక కణములు ఆ యా ప్రతిజనకములకు ప్రతిరక్షకములను (antibodies) ఉత్పత్తి చేస్తాయి. కొన్ని బి - రసికణములు మాత్రము జ్ఞాపక కణములుగా (memory B cells) మిగిలి ఉంటాయి. భవిష్యత్తులో అవే ప్రతిజనకములు (antigens) శరీరములోనికి చొచ్చుకొన్నపుడు ఈ జ్ఞాపక కణములు (memory B cells) వృద్ధిచెంది స్రావక కణములుగా (plasma cells) మారి ప్రతిరక్షకములను (antibodies) ఉత్పత్తి చేస్తాయి. ఆ విధముగా స్ఫురణ రక్షణ (recall- immunity) కలుగుతుంది.

తొలిసారిగా ఒక ప్రతిజనకము (antigen, రోగజనకము pathogen) శరీరములోనికి చొచ్చుకున్నపుడు మొదటి 4-5 దినములు ప్రతిరక్షకములు (antibodies) రక్తములో కనిపించవు. ఆపై రెండవ దశలో మొదట ఐజిఎమ్ (immunoglobulin-M, IgM) ప్రతిరక్షకములు హెచ్చు ప్రమాణములో ఉత్పత్తి అవుతాయి. తరువాత  6-10 దినములకు ఆ ప్రతిజనకములకు ఐజి-జి IgG ప్రతిరక్షకముల (immunoglobulinG) ఉత్పత్తి జరుగుతుంది. మూడవదశలో ప్రతిరక్షకముల ప్రమాణములు స్థిరపడి, నాల్గవ దశలో ప్రతిరక్షకముల ప్రమాణములు మందగిస్తాయి. ఐజి-జి (IgG) ప్రతిరక్షకములు చాలా కాలము రక్తములో ఉండి దీర్ఘకాలిక రక్షణను (long term immunity) సమకూర్చుతాయి. శరీరములో ప్రతిరక్షకములు (antibodies, immunoglobulins) శర్కరమాంసకృత్తులు (glycoproteins). ఇవి Y ఆకారములో ఉంటాయి. ప్రతి ప్రతిరక్షకము (immunoglobulin) లోను రెండు తేలిక గొలుసులు (light chains), రెండు బరువు గొలుసులు (heavy chains) ఉంటాయి. ఈ గొలుసులు చక్కెర (oligosaccharides, glycans),

339 ::