పుట:Hello Doctor Final Book.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలగించుటకు, జీర్ణించుకొనుటకు ఈ పృధుభక్షకకణములు ( macrophages ) తోడ్పడుతాయి. స్రావక కణములు ( Plasma cells ) :

స్రావకకణములలో (plasma cells) న్యూక్లియస్లు ఒక ప్రక్కగా ఒరిగి ఉంటాయి. న్యూక్లియస్లలో డి ఎన్ ఎ పదార్థము చుక్కలుగా  గడియారపు ముఖము, లేక బండిచక్ర ఆకారములో పేర్చబడి ఉంటుంది. కణద్రవము క్షారకాకర్షణమై నీలవర్ణములో కనిపిస్తుంది. స్రావకకణములు, బిరసికణములు (B- lymphocytes) నుంచి ఉద్భవిస్తాయి. ప్రతిజనకములను (antigens) కబళించిన బి రసికణములు (B- lymphocytes), ఏకకణములు (monocytes) ఆ ప్రతిజనకములను పెప్టైడు ( peptide ) ఖండములుగా  భేదించి ఆ ఖండములను టి-రసికణములకు (T-Lymphocytes) చేరుస్తాయి. ఆ టి-రసికణముల ప్రేరణతో  రసిగ్రంథులలోను (lymph glands), ప్లీహములోను (spleen) బి- రసికణములు (B- Lymphocytes) స్రావకకణములుగా (Plasma cells) మార్పు చెందుతాయి. స్రావకకణములు ప్రతిరక్షకములను (antibodies) ఉత్పత్తి చేసి ఆ ప్రతిరక్షకములను రక్తములోనికి స్రవిస్తాయి. ప్రతిరక్షకములు (antibodies) ప్రతిజనకములను (antigens) తటస్థీకరించు ప్రక్రియలో పా ల్గొంటాయి.                                     స్రావక రక్షణము (Humoral immunity) :

శరీరములో రసికణములు (Lymphocytes ), స్రావక కణములు (plasma Cells) స్రవించు ప్రతిరక్షకములు (antibodies, immunoglobulins) సూక్ష్మజీవులను (bacteria), విషజీవాంశములను (viruses), జీవవిషములను (toxins) నిర్మూలించుటకు, తటస్థీకరించుటకు తోడ్పడుతాయి. శరీరములోనికి చొచ్చుకొను సూక్ష్మజీవులు, శిలీంధ్రములు (fungi), విషజీవాంశములు (viruses), జీవవిషములు (toxins), ప్రతిజనకములుగా (antigens) గుర్తించబడుతాయి. ప్రతిజనకముల ప్రేరణ వలన టి:: 338 ::