పుట:Hello Doctor Final Book.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

toplasm) పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ రసికణములు రెండు రకాలు. బి - రసికణములు (B Lymphocytes), టి - రసికణములు (T- Lymphocytes). రక్తప్రసరణలో 10- 15 శాతపు రసికణములు బి- రసికణములు (B -lymphocytes), 70- 80 శాతపు రసికణములు టి.రసికణములు (T-lymphocytes). సూక్ష్మదర్శినిలో ఒకేలా కనిపించినా, ప్రతిరక్షకములను (antibodies) ఉపయోగించి వీటిని వేఱుగా గుర్తించ వచ్చును.

బి - రసికణములు (B-lymphocytes) ప్రతిరక్షకముల (antibodies) ఉత్పత్తికి తోడ్పడుతాయి. టి - రసికణములు ( T- lymphocytes) శరీరములో కణముల ద్వారా జరిగే  ఆలస్య  రక్షణ ప్రతిస్పందనల లోను (delayed Immunological reactions), మార్పిడి అవయవముల తిరస్కరణ ( transplant rejection ) లోను పాల్గొంటాయి. ఏకకణములు ( Monocytes ) :

రక్తములో 3 నుంచి 10 శాతపు తెల్లకణములు ఏకకణములు. మిగిలిన తెల్లకణముల కంటె ఇవి పెద్దవిగా ఉంటాయి. వీటి న్యూక్లియస్లు చిక్కుడు గింజల ఆకారములో ఉంటాయి. వీటి కణ ద్రవములో కణికలు ఉండవు. ఇవి సూక్ష్మజీవులను భక్షిస్తాయి. రోగ కారకములను (pathogens) భక్షించి వాటి భాగములను టి - రసికణములకు (T- lymphocytes ) జ్ఞప్తికై అందిస్తాయి. భవిష్యత్తులో ఆ రోగ కారకములు దేహములోనికి చొచ్చుకొన్నపుడు వాటిని రక్షణ స్రావకములతో (immunoglobulins) ఎదుర్కొనుటకు ఈ చర్య తోడ్పడుతుంది. ఈ ఏకకణములు (monocytes) ప్లీహములో ఎక్కువగా నిలువ ఉంటాయి.

ఏకకణములు రక్తమునుంచి అవయవముల కణజాలములకు కూడా చేరి పృధుభక్షక కణములుగా (macrophages) మార్పు చెందుతాయి. పృధుభక్షకకణములు  (macrophages సూక్ష్మజీవులను భక్షిస్తాయి. మరణించిన కణజాల అవశేషములను, సూక్ష్మజీవుల అవశేషములను

337 ::