పుట:Hello Doctor Final Book.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కణికలు (granules)  నారింజరంగులో ఉంటాయి.  వీటి న్యూక్లియస్లు సాధారణముగా ఒక కణుపుతో రెండు భాగములుగా చీలి ఉంటాయి. రక్తపు శ్వేతకణములలో వీటి శాతము 2- నుంచి 4 వఱకు ఉంటుంది. కొక్కెపు క్రిములు ( hookworms ), ఏటికక్రిములు (roundworms), నారిక్రిములు (Tape worms) వంటి  పరాన్నభుక్తులు (parasites) దేహములో ప్రవేశించినపుడు, అసహన ( allergies ) వ్యాధులు కలిగినపుడు, ఉబ్బస వంటి వ్యాధులు కలిగినపుడు వీటి సంఖ్య పెరుగుతుంది. ఇవి విడుదల చేసే రసాయనములు పరాన్నభుక్తులను చంపుటకు ఉపయోగపడుతాయి. ఈ ఆమ్లాకర్షణ కణములు భక్షణలో ( phagocytosis ) పాల్గొనవు. క్షారాకర్ష ణ కణములు ( Basophils ) :

ఈ కణములలో న్యూక్లియస్లు రెండు, లేక మూడు భాగములుగా విభజించబడి ఉంటాయి. హెమటాక్సిలిన్, యూసిన్ (hematoxylin, eosin) వర్ణకములు కలిపినపుడు కణద్రవములో కణికలు ముదురు ఊదారంగులో ఉంటాయి. ఈ కణికలలో హిష్టమిన్ (histamine), హిపరిన్ (heparin), ప్రోష్టాగ్లాండిన్స్ (prostaglandins) వంటి రసాయనములు ఉంటాయి. రక్తపు శ్వేతకణములలో వీటి శాతము 0.5 ఉంటుంది. కణజాలములో ఉండే స్తంభకణముల (mast cells) వలె ఇవి ఐజి-ఇ ని ( immunoglobulin E,  IgE) ఆకర్షిస్తాయి. ప్రతిజనకములు (antigens) ఈ కణములపై ఉండు ఐజి-ఇ తో (IgE) సంధానము అయినపుడు రసాయనములను విడుదల చేసి అసహనములు (allergies), రక్షణ వికటత్వములను (anaphylaxis) కలిగిస్తాయి. తాప ప్రక్రియలలో కూడా ఇవి పాల్గొంటాయి. కణికలు లేని శ్వేతకణములు : రసికణములు ( lymphocytes )

రసికణములు (lymphocytes) రక్తములో తెల్లకణములలో సుమారు ఇరవైశాతము ఉంటాయి. కణిక కణముల కంటె పరిమాణములో చిన్నవిగా ఉంటాయి. వీనిలో న్యూక్లియస్లు పెద్దవిగా ఉండి కణద్రవ (cy:: 336 ::