పుట:Hello Doctor Final Book.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెల్ల కణములు ( Leukocytes ) :

తెల్లకణములు శరీరరక్షణలో పాల్గొంటాయి. తెల్లకణములు ఎముకల మజ్జలో బహుళ సామర్థ్య మూలకణముల ( pluripotent stem cells) నుంచి ఉద్భవిస్తాయి. తెల్లకణములను కణికలు గల కణములు (granulocytes), కణికలు లేని కణములుగా (non granulocytes) విభజించవచ్చును.

వీనిలో కణికల కణములు (granulocytes) అధికశాతములో ఉంటాయి. కణికలకణములలో న్యూక్లియస్ లు పలు కణుపులతో భాగములుగా (మూడు నుంచి ఐదు వఱకు) విభజించబడి ఉంటాయి. హెమటాక్సొలిన్ - యూసిన్ వర్ణకములు (hematoxylin - eosin  pigments) కలిపి సూక్ష్మదర్శినితో చూసినపుడు కణద్రవములో  కణికలు (granules) చుక్కలు వలె కనిపిస్తాయి. కణికల రంగు బట్టి ఇవి తటస్థ కణములు ( Neutrophils ), ఆమ్లాకర్షణ కణములు (Acidophils or Eosinophils ), క్షారాకర్షణ కణములు (Basophils) అని మూడు రకములు. తటస్థ కణములు ( Neutrophils ):

రక్తములో హెచ్చు శాతపు ( 60- 70 శాతము )  శ్వేతకణములు తటస్థకణములు. హెమటాక్సిలిన్, యూసిన్ వర్ణకములు (hematoxylin, eosin) చేర్చినపుడు  వీటి కణద్రవములలో (plasma) కణికలు లేత ఊదారంగులో చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి. సూక్షజీవులు, శిలీంధ్రములు (fungi) శరీరములో ప్రవేశించినపుడు వీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి సూక్ష్మజీవులను, శిలీంధ్ర కణములను (fungi) కబళిస్తాయి (phagocytosis). పలు సూక్ష్మజీవులను కబళించి, వాటిని  నిర్మూలించిన పిదప ఈ కణములు మరణించుటచే చీము ఏర్పడుతుంది. ఆమ్ లా కర్ష ణ కణములు ( Eosinophils , Acidophils ) :

హెమటాక్సిలిన్ - యూసిన్ వర్ణకములతో   కణద్రవములో వీటి

335 ::