పుట:Hello Doctor Final Book.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రతిరక్షకములను (antibodies) స్రావక కణముల (Plasma cells) ద్వారా తయారుచేయు ప్రక్రియకు దోహదకారి అవుతాయి.

గొంతులో ఉండే గవదలు (tonsils), చిన్నప్రేవుల (small intestines) లోను, క్రిముకము (appendix) లోను ఉండే రసికణజాలము (lymphoid tissue) రక్షణవ్యవస్థలో భాగములే. చర్మము, శ్లేష్మపు పొరల (శ్లేష్మ త్వచము ; mucous membranes) ద్వారా వ్యాధికారకములు (pathogens) శరీరములోనికి చొచ్చుకొన్నపుడు శరీరరక్షణ వ్యవస్థ రోగ జనకములను (pathogens) నిర్మూలించి, వాటిని  తటస్థీకరణము చేయుటకు ప్రయత్నిస్తుంది. ఈ రక్షణవ్యవస్థ నిర్మాణము, వ్యాపారము క్లిష్టతరమైనను శాస్త్రజ్ఞుల కృషి వలన చాలా విషయములు ఎఱుకలోనికి వచ్చాయి. ఈ శరీరరక్షణ వ్యవస్థలో  వివిధకణములు, స్రావములు  ( secretions) పాలుపంచుకుంటాయి.

రక్తములో ఎఱక ్ఱ ణములు (erythrocytes), తెల్లకణములు (leukocytes), రక్తఫలకములు (platelets), రక్తద్రవము (plasma) ఉంటాయి. ఎఱ్ఱకణములు ప్రాణవాయువును కణజాలమునకు చేర్చుటకు ఉపయోగపడుతాయి. రక్తఫలకములు రక్తము గడక ్డ ట్టుటకు, రక్తస్రావము నివారించుటకు తోడ్పడుతాయి. తెల్లకణములు రోగజనకములను  (pathogens) కబళించుటకు, నిర్మూలించుటకు ఉపయోగపడుతాయి. రక్తద్రవములో (plasma) ఉండే ప్రతిరక్షకములు (antibodies), ఇతర స్రావములు వ్యాధి కారకములను తటస్క థీ రించుటకు తోడ్పడుతాయి. కణ రక్షణ

334 ::