పుట:Hello Doctor Final Book.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రక్రియకు దేహము పూనుకుంటుంది. రోగజనకములు (pathogens) గాయముల ద్వారా శరీరములోనికి చొరబడనీయకుండా నివారించుటకు ప్రయత్నము చేస్తుంది.

అంతేకాక శరీరములో ప్రత్యేక రక్షణ వ్యవస్థ నిక్షిప్తమై ఉన్నది. ఎముకలలోని మజ్జలో బహుళ సామర్థ్య మూలకణముల  (pluripotent stem cells ) నుంచి శ్వేతకణములు ఉత్పత్తి చెంది శరీరరక్షణలో పాల్గొంటాయి. థైమస్ గ్రంథి ( Thymus gland ) :

థైమస్ గ్రంథి (thymus)  గళగ్రంథి ( thyroid gland ) క్రింద నుంచి ఛాతి పైభాగములో యిమిడి ఉంటుంది. ఇందులో టి - రసికణములు (T- Lymphocytes) ఉత్పత్తిచెంది, పరిపక్వము పొందుతాయి. టిరసికణములు (T- Lymphocytes) శరీరరక్షణలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. స్వయంప్రహరణ కణముల (auto reactive) నిర్మూలనము కూడా థైమస్ గ్రంథిలో జరుగుతుంది. స్వయంప్రహరణ వ్యాధులను (auto immune diseases) నివారించుటకు థైమస్ (thymus) గ్రంథి తోడ్పడుతుంది. రసిగ్రంథులు ( Lymph glands ) :

శరీరములో గజ్జలలోను, బాహుమూలములలోను, మెడలోను, ఉదరములోపల, ఛాతిలోపల సముదాయములుగా ఉండే  రసిగ్రంథులు (lymph glands) వ్యాధికారకములను (pathogens) వడగట్టి అవి కలిగించు వ్యాధులను ( infections ) ఆ యా ప్రాంతములకు పరిమితము చేస్తాయి. ప్లీ హము ( Spleen ) :

ఉదరములో ఉండే ప్లీహము (spleen) రక్తము ద్వారా వచ్చే ప్రతిజనకములను (antigens) వడగట్టుతుంది. ఇందులో ఉండే రసికణములు (lymphocytes ), ప్రతిజనకములను విచ్ఛేదించి, వాటికి

333 ::