పుట:Hello Doctor Final Book.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31. శరీర రక్షణ వ్యవస్థ ( Immune System ) జంతుజాలపు మనుగడకు శరీరరక్షణ వ్యవస్థ చాలా అవసరము. సూక్ష్మాంగ జీవులు (bacteria), విషజీవాంశములు (viruses), శిలీంధ్రములు (fungi), పరాన్నభుక్తులు (parasites), జీవవిషములు (toxins), ఇతర మాంసకృత్తులు (proteins ), శర్కర మాంసకృత్తులు (glycoproteins) శరీరము లోనికి చొచ్చుకొని నిత్యము దాడి చేస్తుంటాయి. శరీర రక్షణ వ్యవస్థ వానిని తటస్థీకరించుటకు, నిర్మూలించుటకు యత్నిస్తుంది. దాడి చేసే సూక్ష్మజీవులు, విషజీవాంశములు, జీవవిషములు శరీరములోనికి ప్రవేశించకుండా చర్మము, శ్వాసపథము, జీర్ణమండలము, మూత్ర జననాంగములను కప్పే శ్లేష్మపు పొరలు (mucous membranes) చాలా వఱకు నివారిస్తూ దేహమునకు  రక్షణ చేకూరుస్తుంటాయి. దేహము దగ్గు, తుమ్ము  ప్రక్రియల వలన శ్వాసమార్గములోని వ్యాధి కారకములను (pathogens), ప్రకోపకములను (irritants) శరీరము బయటకు నెట్టగలుగుతుంది. శ్వాసమార్గములోను, జీర్ణమండలము లోను శ్లేష్మము (mucous) వ్యాధి కారకములను బంధించి తొలగించ గలుగుతుంది. జీర్ణాశయములోని ఉదజహరికామ్లము (hydrochloric acid), జీర్ణాశయములోని రసములు, జీవోత్ప్రేరకములు (enzymes) సూక్ష్మాంగజీవులను నిర్మూలించుటకు ఉపయోగపడుతాయి.

చెమటలోను, కన్నీళ్ళలోను, స్తన్యములోను, శ్వాసపథ స్రావములలోను, మూత్ర, జననాంగ పథములోను ఉండే రసాయనములు, lysozyme  వంటి  జీవోత్ప్రేరకములు ( enzymes), సూక్ష్మాంగ జీవులను ధ్వంసము చేయుటకు ఉపయోగపడుతాయి. శరీరమునకు గాయములు తగిలిన వెంటనే స్రవించు రక్తము గడ్డకట్టి గాయములను పూడ్చుటకు తోడ్పడుతుంది. ఆపై గాయములను మాన్చు

332 ::