పుట:Hello Doctor Final Book.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చికిత్స లక్ష్యములు :

మధుమేహవ్యాధి లక్షణములను అదుపులో పెట్టుట, రక్తపు చక్కెరలను అదుపులో ఉంచుట, వ్యాధి వలన కలిగే ఉపద్రవములను అరికట్టుట చికిత్స లక్ష్యములు. వీరిలో రక్తపీడనమును, రక్తములో కొవ్వుపదారము ్థ లను అదుపులో ఉంచుట కూడా చాలా ముఖ్యము. చక్కెరల నియంత్రణ :

మధుమేహవ్యాధిగ్రస్థులలో రక్తములో పరగడుపు చక్కెర విలువలు, భోజనమునకు ముందు చక్కెర విలువలు 80-130 మి.గ్రాలు/డె.లీ పరిధిలోను, భోజనము తర్వాత 180 మి.గ్రాలు/ డె.లీ లోపున, హీమోగ్లోబిన్ A1C విలువలు 7 % కంటె తక్కువగాను ఉంచుటకు ప్రయత్నించాలి. తక్కువ చక్కెర విలువలు (శర్కర హీనత ; hypoglycemia) కూడా నివారించాలి. ఆహారము :

మధుమేహవ్యాధిగ్రస్థులు తగిన పోషకపదార్థములు కల సమీకృత ఆహారమును భుజించాలి. స్థూలకాయులు బరువు తగ్గుటకు ఆహారములో కాలరీలను పరిమితము చేసుకోవాలి. పురుషులు దినమునకు 1200- 1800 కాలరీలకు, స్త్రీలు దినమునకు 1000- 1500 కాలరీలకు వారి బరువు, చేసే శారీరక శ్రమ బట్టి ఆహారమును నియంత్రించుకోవాలి. వీరి ఆహారములో 45-65% శాతము పిండిపదారము ్థ లు, 10-30% శాతము మాంసకృత్తులు, 30% కంటె తక్కువగా కొవ్వులు 7% శాతము కంటె తక్కువగా సంతృప్తపు కొవ్వులు (saturated fats), 300 మి.గ్రాల కంటె తక్కువగా కొలెష్ట్రాలు ఉండాలి. వ్యాయామము :

వ్యాయామము వలన దేహములో ఇన్సులిన్ కు ప్రతిఘటన (resistance) తగ్గుతుంది, రక్తపు చక్కెర విలువలను అదుపులో ఉంచుట తేలిక అవుతుంది, జీవవ్యాపారక్రియ (metabolism) మెరుగవుతుంది. దినమునకు అరగంట నుంచి గంట వఱకు క్రీడలకు, వ్యాయామమునకు వినియోగించుట

32 ::