పుట:Hello Doctor Final Book.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇన్సులిన్ లోపము అధికమైతే చక్కెర ఆమ్లజనీకరణము (Oxygenation) అసంపూర్తి కావుటచే కీటోనులు (Ketones) పెరిగి రక్త ము ఆమ్లీకృతము కావచ్చును (Diabetic Keto Acidosis) దీని వలన అత్యవసర పరిస్థితి కలుగవచ్చు. అపస్మారకస్థితి రావచ్చును. చక్కెర స్థాయి బాగా పెరుగుతే రక్త రసాకర్షణ పీడనము పెరిగి అపస్మారక స్థితి (Hyperosmolar coma) కలుగ వచ్చు. వ్యాధి నిర్ణయము :

రక్త ము లో చక్కెర విలువలు చూసి వ్యాధిని నిర్ణ యిం చవచ్చును. రక్తములో గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ (Glycated Haemoglobin) విలువలు కూడా మధుమేహవ్యాధిగ్రస్థులలో పెరుగుతాయి. చికిత్స :

మొదటి రకపు మధుమేహమునకు ఇన్సులిన్ వాడుక తప్పనిసరి.

వయోజన మధుమేహమునకు జీవనశైలి మార్పులు తప్పనిసరి. పరిమిత ఆహారము, క్రొవ్వుల, చక్కెరల వినియోగమును నియంత్రించుట, వ్యాయామము చేయుట, చక్కెరపానీయాలు మానుట, పొగత్రాగుట మానుట, మద్యమువాడుక పరిమితిలో ఉంచుట చాలా అవసరము.

మెట్ ఫార్మిన్, ఇన్సులిన్ స్రావక ప్రేరణములు (insulin secretagogues), క్రమరీతిలో వైద్యులు వాడుతారు. అవసరమయితే ఇన్సులిన్ వాడుక తప్పదు.

రక్తపుపోటును అదుపులో పెట్టుట, స్టాటిన్స్ తో కొలెస్ట్రాల్ ని తగ్గించుట, మూత్రాంగముల (kidneys) రక్షణకు ఏస్ ఇన్హిబిటర్లు (ACE inhibitors) వాడుట, హృదయఘాతములను (Heart attacks), మస్తిష్క విఘాతములను నివారించుటకు ఎస్పిరిన్ వాడుట, కళ్ళపరీక్షలు, సరియైన పాదరక్షలు చికిత్సలో భాగమే. స్థూలకాయములను తగ్గించుట చాలా అవసరము. సారాయి త్రాగేవారు వాడుకను పరిమితిలో ఉంచుకోవాలి.

31 ::