పుట:Hello Doctor Final Book.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవరోధము పెరుగుటచే ఇన్సులిన్ సమర్థత తగ్గుతుంది. రక్తములో ఇన్సులిన్ విలువలు ఎక్కువగా ఉన్నా దాని ఫలితము తక్కువే.

గర్భిణీ స్త్రీలలో పెక్కు వినాళ గ్రంథుల స్రావకముల వలన (Harmones) గర్భిణీ మధుమేహము (Gestational Diabetes) కలుగ వచ్చును. ప్రసవము తర్వాత చాలామందిలో మధుమేహము నయమవుతుంది. ప్రవర్ధక స్రావ ఆధిక్యత (growth hormone excess), గళగ్రంథి ఆధిక్యత (hyperthyroidism), కుషింగ్ వ్యాధి (Cushing syndrome), వంటి ఇతర వినాళ గ్రంథుల వ్యాధులు, క్లోమ వ్యాధులు, గ్లూకో కార్టికో స్ టీ రా యిడుల వంటి మందులు, శస్త్రచికిత్సతో క్లోమమును తీసివేయుట, మరికొన్ని యితర వ్యాధుల వలన మధుమేహము కలుగ వచ్చును. వ్యాధి లక్షణాలు :

రక్తములో చక్కెర స్థాయి పెరిగి మూత్రములో చక్కెర విసర్జింపబడితే, చక్కెరతో బాటు జలవిసర్జన కూడా కలిగి అతిమూత్రము కలుగుతుంది. జలనష్టము వలన దాహము పెరుగుతుంది. చక్కెర నష్టము వలన బరువు తగ్గుతారు. ఆకలి పెరిగి వారు తిండి ఎక్కువగా తిన్నా బరువు తగ్గుతారు. కళ్ళ కటకములలో చక్కెర, నీరు చేరి కటకపు ఆకారము మారడము వలన దృష్టిలోపాలు కలుగ వచ్చును. కొందఱిలో విశేషముగ లక్షణాలు పొడచూపక పోవచ్చును. కొందఱు క్లిష్టపరిస్థితులతోనే వైద్యులను సంప్రదించవచ్చును. మధుమేహము వలన వచ్చే జటిలములు :

మధుమేహవ్యాధి వలన సూక్ష్మ రక్తనాళములు కుచించుకు పోతాయి. రక్తనాళములు బిరుసెక్కి ధమనీకాఠిన్యము (Atherosclerosis) కలిగి హృద్రోగములు, మస్తిష్క విఘాతములు (Cerebrovascular accidents), మూత్రాంగ వైఫల్యము (Renal failure), దూర రక్తప్రసరణ లోపములు (Peripheral Vascular disease) కలుగుతాయి. మధుమేహము వలన దృష్టిదోషములు, దూరనాడుల తాపముతో (Peripheral neuritis) స్పర్శలోపములు కలుగ వచ్చును.

30 ::