పుట:Hello Doctor Final Book.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మేలు చేకూరుస్తుంది. ఔషధములు :

పిన్నవయస్సులో వచ్చే మొదటి రకపు మధుమేహవ్యాధి (Type 1 diabetes mellitus) చికిత్సకు ఇన్సులిన్ అవసరము. ఇన్సులిన్ వాడుక గుఱించి తర్వాత చర్చిస్తాను. వయోజనులలో వచ్చే రెండవరకపు మధుమేహవ్యాధి (Type 2 diabetes mellitus) తీవ్రము కానప్పుడు, ఆహార వ్యాయామములతో అదుపులోనికి రానప్పుడు వివిధ వరము ్గ లకు చెందిన ఔషధములను వాడుతారు. ఆ మందులతో మధుమేహవ్యాధి అదుపులోనికి రానప్పుడు ఇన్సులిన్ వాడుక తప్పనిసరి అవుతుంది. బై గానై డ్ ( Biguanide ) :

మెట్ ఫార్మిన్ (metformin) ఈ తరగతికి చెందిన ఔషధము. ఇది కాలేయము నుంచి చక్కెర విడుదలను తగ్గిస్తుంది. కణజాలములో చక్కెర గ్రహణమును పెంచుతుంది. రక్త ము లో చక్కెర విలువలు తగ్గి స ్త ుం ది. వాడకూడని పరిస్థితులు (contraindications) లేనివారిలో వైద్యులు మెట్ ఫార్మిన్ ను ప్రధమముగా ఎన్నుకుంటారు.

రక్తపు క్రియటినిన్ విలువలు పురుషులలో 1.5 మి.గ్రా/డె.లీ, స్త్రీలలో 1.4 మి.గ్రా/డె.లీ మించి ఉన్నపుడు మెట్ ఫార్మిన్ వాడకూడదు. హృద్రోగముల వలన కాని, సూక్ష్మాంగజీవుల ఆక్రమణ (sepsis) వలన కాని రక్తపీడనము బాగా తగ్గి కణజాలమునకు రక్తప్రసరణ చాలనపుడు, రక్తములో ప్రాణవాయువు సంపృక్తత (oxygen saturation) బాగా తగ్గినపుడు, హృదయవైఫల్యము, కాలేయవైఫల్యము ఉన్నపుడు మెట్ ఫార్మిన్ వాడకూడదు. ఎక్స్ రే చిత్రీకరణము లలో వ్యత్యాసపదార్థములు (radio opaque contrast materials) వాడుటకు ముందు మెట్ ఫార్మిన్ ను 48 గంటలు నిలిపివేయాలి. అరుదుగా మెట్ ఫార్మిన్ వాడుక వలన రక్తము ఆమ్లీకృతము (acidosis) కావచ్చును. వారిలో మెట్ ఫార్మిన్ వాడుకను ఆపివేయాలి.

33 ::