పుట:Hello Doctor Final Book.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కారణము కావచ్చును.

కేవలము జన్యుకారణముల వలనే సంక్రమించే స్థూలకాయములు చాలా అరుదు. చాలామందిలో స్థూలకాయములకు వివిధ కారణాలు, పెక్కు జన్యువులు కారణము అవుతాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువబరువు, స్థూలకాయములు సంభవించినా దానికి వారి జీవనశైలి, పరిసరాల ప్రాబల్యమే ప్రధాన కారణము. జీవనశైలులలో మార్పుల వలన వారు స్థూలకాయములను నిరోధించ వచ్చును. రుగ్మతలు :

కుషింగ్ సిండ్రోము (Cushing Syndrome), పాలీ సిస్టిక్ ఓవరీలు (Polycystic Ovaries), మానసిక వ్యాధులు  అధిక భారమును కలిగిస్తాయి. ఔషధములు :

కుంగువ్యాధులు, యితర మానసికవ్యాధులకు వాడే (Atypical antipsychotics) మందులు, ఎడ్రినల్ కార్టికో ష్టీరాయిడులు ( Adrenal Corticosteroids), మధుమేహవ్యాధి మందులు, గర్భనిరోధక ఔషధములు, కొన్ని మూర్ఛమందులు బరువు పెరుగుటకు తోడ్పడ వచ్చును. ఆకలి ఎక్కువయి ఎక్కువగా భుజించుట దానికి కారణము.  స్థూ లకాయము వలన పరిణామములు :

ఎక్కువబరువు, స్థూలకాయము కొన్ని రుగ్మతలకు దారి తీస్తాయి. ఎక్కువబరువు ఉన్న వారిలో అధిక రక్తపీడనము కలిగే అవకాశములు  ఎక్కువ. మధుమేహవ్యాధి, అల్ప సాంద్రపు కొలెష్టరాలు ఎక్కువగుట ( Low density lipoproteins ), అధిక సాంద్రపు కొలెష్టరాలు  ( High density lipoproteins) తక్కువగుట, ట్రైగ్లిసెరైడులు ఎక్కువ అవుట ఎక్కువగా సంభవిస్తాయి.  హృద్రోగములు, హృద్ధమనుల వ్యాధులు (Coronary artery disease), మస్తిష్క విఘాతములు (Cerebro vascular accidents), పిత్తాశయ వ్యాధులు (Gall bladder diseas:: 327 ::