పుట:Hello Doctor Final Book.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

es), కీళ్ళ వాతములు (ముఖ్యముగా మోకాళ్ళ నొప్పులు, తుంటి సంధుల నొప్పులు), ఒళ్ళు నొప్పులు ఎక్కువగా సంభవిస్తాయి. కాలేయములో కొవ్వు చేరి కాలేయపు కొవ్వువ్యాధి (Fatty Liver disease) సంభవిస్తుంది. స్థూలకాయులలో ఆమ్ల తిరోగమనము (Acid Reflux) ఎక్కువ. మూత్రాంగవైఫల్యములు, కుంగుదల వంటి మానసికవ్యాధులు వీరిలో ఎక్కువ. జడత్వము, నిశ్చలత్వము, మందకొడితనము ఎక్కువయి జీవన రీతులు అసంపూర్ణముగా ఉంటాయి. కొన్ని కర్కటవ్రణములు (Cancers ; పెద్దప్రేవుల, కాలేయపు, పిత్తాశయపు, మూత్రాంగముల కర్కటవ్రణములు, స్త్రీలలో రొమ్ము, బిడ్డసంచీ కర్కటవ్రణములు) కూడా స్థూలకాయులలో ఎక్కువగా కలుగుతాయి. వీరిలో నిద్రలో కలిగే అవరోధ శ్వాసభంగములు (Obstructive Sleep Apnea) ఎక్కువగా కలుగుతాయి. తామర, ఒరుపులు ( Intertrigo ), సూక్ష్మాంగజీవులు కలిగించే వాపులు, పుళ్ళు ( Boils) వంటి చర్మవ్యాధులు కూడా స్థూలకాయములు కలవారిలో ఎక్కువ. ఫైన పేర్కొన్న వివిధకారణముల వలన బరువు ఎక్కువగా కలవారిలోను, స్థూలకాయులలోను ఆయుః ప్రమాణము తగ్గుతుంది. స్థూ లకాయము, ఎక్కువ బరువులను నివారించు మార్గ ములు :

తక్కువ  ఆహారము తక్కువ కాలరీలు గ్రహించుట వలన, వ్యాయామముతో ఎక్కువ కాలరీలను ఖర్చు పెట్టుట వలన బరువు తగ్గుతారు. కాలరీలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయాల ద్వారా దేహానికి చేరుతాయి. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చక్కెర, వెన్న, నేతులతో చేసిన చిల్లర తిళ్ళు వలన, తఱచు వివిధ రకాల చిరుతిళ్ళు తినుటవలన, అధిక పరిమాణములలో భోజనము భుజించుట  వలన కాలరీలు ఎక్కువగా  గ్రహించుట జరుగుతుంది. దేహము ఖర్చు పెట్టని కాలరీలు ఏ రూపములో వెళ్ళినా చివరకు కొవ్వుగా దేహములో నిలువ అవుతాయి. ఆహారములో కాలరీల తగ్గ ింపు :

అందువలన ఊబ కాయము తగ్గాలంటే చక్కెర సహిత శీతలపానీయాలు

328 ::