పుట:Hello Doctor Final Book.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలేయములపై అధికముగా ఉంటుంది. చిన్నమెదడు (cerebellum) పై కూడా అధిక ప్రభావము ఉంటుంది. శరీర అస్థిరత (ataxia) తొలి లక్షణము కావచ్చును.

తీవ్రజ్వరము (hyperthermia), అపస్మారకములను కలిగించే ఇతర వ్యాధులను దృష్టిలో పెట్టుకున్నా, పరిసరముల ఉష్ణోగ్రత, శారీరక ప్రయాస వంటి పరిస్థితుల బట్టి వడదెబ్బను (heat stroke) పసిగట్టి సత్వర వైద్యమును సమకూర్చాలి. వ్యాధిగ్రస్థుడు నేలకు కూలబడిన 30 నిమిషముల వ్యవధిలో చికిత్స మొదలు పెడితే మృత్యువును నూరు శాతము నివారించవచ్చును. శరీరాంతర ఉష్ణోగ్రత ఆసుపత్రులకు చేరేటప్పుడు 105.8 డిగీలు దాటి ఉన్నవారిలోను, హెచ్చుకాలము తీవ్రజ్వరము ఉన్నవారిలోను మృత్యువు అవకాశము 80 శాతము వఱకు ఉండవచ్చును. అందువలన రోగిని చల్లపఱచే ప్రక్రియలను వైద్యాలయములకు తరలించుటకు ముందే మొదలుపెట్టి మార్గములో కూడా కొనసాగించాలి. వడదెబ్బ తగిలిన వారిని వారి ఉష్ణోగ్రత తగ్గించుటకు ( తల తప్పించి మిగిలిన శరీరమును ) చల్లని నీటిలో ( 50 F ) గాని, మంచునీటిలో గాని ( 35.6 F - 41 F ) ముంచి ఉంచుట ఉత్తమమార్గము.    చల్లనీరు, మంచునీరు లభ్యము కానప్పుడు గోరువెచ్చని నీటిని ( 68 F) వాడవచ్చును. వారి శరీరాంతర ఉష్ణోగ్రతను ( core body temperature ) ఉష్ణమాపకము పురీషనాళములో ఉంచి కొలవాలి. శరీరాంతర ఉష్ణోగ్రత 101 F డిగ్రీలకు దిగేవఱకు చల్లపఱచే యత్నములను కొనసాగించాలి. తడిగుడ్డలతో కప్పుట, పెద్దధమనులు ఉండేచోట్ల ( చంకలు, మెడ, మొలలు వద్ద) మంచుపొట్లములు ఉంచుట, పంకాగాలులు, చల్లనీరు జల్లుల వంటి ప్రక్రియలను ఉయోగించినా వడదెబ్బ చికిత్సకు అవి అంత ఫలవంతములు కాదు.

శరీరమును చల్లార్చే ప్రయత్నములు కొనసాగిస్తూ వ్యాధిగ్రస్థులను అత్యవసర వైద్యాలయములకు తరలించాలి. వైద్యాలయములలో శరీరాంతర ఉష్ణోగ్రతను 101 F డిగ్రీలకు తగ్గించే ప్రక్రియలు కొనసాగిస్తూ సిరల ద్వారా చల్లని లవణ జలములు ( cold saline ) ఇవ్వాలి.  జ్వరము తగ్గించు

321 ::