పుట:Hello Doctor Final Book.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వడదెబ్బ ( ఉష్ణ ఘాతము Heat stroke ) :

వడదెబ్బ ( ఉష్ణఘాతము ) తగిలిన వారికి శరీరాంతర ఉష్ణోగ్రత (core body temperature) 105 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ (40.5 డిగ్రీల సెంటీగ్రేడ్) గాని, అంతకు మించిగాని ఉండి కేంద్ర నాడీమండల వ్యాపారములో విలక్షణములు కనిపిస్తాయి. వీరిలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లోపిస్తుంది.

వడదెబ్బను అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. సత్వరముగా చికిత్స చేసినట్లయితే ప్రాణాపాయమును నివారించవచ్చును. చికిత్స ఆలస్యము అయినకొలది రోగులు మృత్యువాత పడే అవకాశములు హెచ్చవుతుంటాయి.   వడదెబ్బ శారీరకశ్రమ సహితము (exertional) గాని, శారీరక శ్రమరహితము (nonexertional) గాని కావచ్చును. శరీర ఉష్ణోగ్రత తీవ్రతరము అయినపుడు శరీరములో మాంసకృత్తులు వికృతము (denature) చెందగలవు. అందువలన శరీర వ్యాపారక్రియలు (metabolic activities) మందగించుటే గాక, అంతర జీవవిషములు (endotoxins) కూడా విడుదల అవుతాయి. శరీరములో తాప ప్రతిస్పందన (inflammatory response) కూడా ప్రారంభము అవుతుంది. వివిధ అవయవములలో విలక్షణములు కలిగి అవయవ వ్యాపారములు వైఫల్యముచెంది మరణమునకు దారి తీస్తాయి. వడదెబ్బ (ఉష్ణ ఘాత) లక్షణములు :

వడదెబ్బకు గుఱైనవారిలో శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫాహ్రెన్ హైట్ గాని అంతకు మించి గాని ఉంటుంది. మానసిక ఆందోళన, అలజడి, గందరగోళము, కలవరము, మూర్ఛలు, స్మృతిభ్రంశము, అపస్మారకము వంటి మానసిక అవలక్షణములు కలుగుతాయి. వీరు నేలపై కూలిపోయి కనిపిస్తారు. చర్మము వేడిగా ఉంటుంది. చెమటలు బాగా పోయవచ్చును. చెమటలు లేనప్పుడు చర్మము పొడిగా ఉండవచ్చును. వీరిలో గుండె వేగము హెచ్చుగా ఉంటుంది. శ్వాస వేగము హెచ్చయి ఆయాసము పొడచూపవచ్చును. రక్తపీడనము తగ్గుతుంది. వడదెబ్బ ప్రభావము మెదడు,

320 ::