పుట:Hello Doctor Final Book.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మందులు (antipyretics), డాంట్రొలీన్ (Dantrolene) వడదెబ్బకు పనిజేయవు.

వడదెబ్బ ప్రాధమిక చికిత్స కొనసాగిస్తూ, వారికి రక్తకణ పరీక్షలు, జీవవ్యాపార పరీక్షలు [complete metabolic panel ; విద్యుద్వాహక లవణములు (electrolytes), మూత్రాంగ వ్యాపార పరీక్షలు ( యూరియా నైట్రొజెన్ BUN, క్రియటినిన్ (creatinine), కాలేయ వ్యాపార పరీక్షలు (liver function tests), క్రియటినిన్ కైనేజ్ ( creatinine kinase)], మయోగ్లోబిన్ (myoglobin) ప్రమాణములు, రక్తఘనీభవన పరీక్షలు (blood coagulation tests), మూత్రపరీక్షలు చెయ్యాలి. వడదెబ్బకు లోనయిన వారిలో మూత్రాంగముల వైఫల్యము, శ్వాసవైఫల్యము, కాలేయపు అవలక్షణములు, అస్థికండర కణ విధ్వంసము (rhabdomyolysis), విద్యుద్వాహక లవణ భేదములు (electrolyte imbalances), విస్తృత రక్తనాళాంతర రక్తఘనీభవనము (disseminated intravascular coagulation) వంటి అవలక్షణములు కలిగే అవకాశము ఉన్నది. ఆయా అవలక్షణములు కనిపెట్టి తగిన చికిత్సలు చెయ్యాలి.వడదెబ్బ నుంచి కోలుకున్నవారు కనీసము వారము దినములు ఎట్టి శ్రమ, వ్యాయామములలో పాల్గొనకూడదు. పూర్తిగా కొలుకున్నాక చల్లని వాతావరణములో వ్యాయామము, క్రీడలు, శారీరక శ్రమలలో పరిమితముగ పాల్గొనుట మొదలిడి క్రమముగా కార్యకలాపములను పెంచవచ్చును. ఉష్ణ సంబంధ వ్యాధుల నివారణ :

వేడి వాతావరణములో శ్రమించువారు, వసించువారు తఱచు ద్రవపదార్థములను సేవించాలి. మంచినీళ్ళు, చక్కెరపానీయాలు రెండు మూడు లీటరుల వఱకు సేవించినా, లవణ సహిత పానీయములను కూడా సేవించుట మేలు. పలుచని, వదులు, లేతవర్ణపు దుస్తులు ధరించాలి.

వేడి వాతావరణమునకు క్రమేణ అలవాటుపడాలి. పరిసర ఉష్ణోగ్రత అధికముగా ఉన్నపుడు పరిశ్రమ చేయకూడదు. తప్పనిసరి అయితే విరామ సమయములు తీసుకొని, చల్లని పానీయములు సేవిస్తూ ఉండాలి. లవణ నష్టములను కూడా పూరించాలి. మంచినీరు, చక్కెర పానీయాలు మాత్రమే

322 ::