పుట:Hello Doctor Final Book.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇవి సాధారణముగా వస్త్రములతో కప్పబడు శరీర భాగములలో కనిపిస్తాయి. చల్లని ప్రదేశములకు చేరి అధిక వస్త్రధారణ మానుట వలన, చర్మపు తేమ తగ్గించుకొనుట వలన చెమట కాయలు తగ్గుతాయి. వడ సొమ్మ ; ఉష్ణ మూర్ఛ ( Heat Syncope ) :

ఎక్కువసేపు వ్యాయామము చేసినప్పుడు సొమ్మసిల్లుట సంభవించ వచ్చును. వ్యాయామములో దేహములో పుట్టే వేడిమికి శరీరపు క్రింద భాగములలో రక్తనాళములు వ్యాకోచించుట (Peripheral vasodilation) వలనను, ఎక్కువ చెమటచే కలుగు జల లవణముల నష్టము వలనను, దేహ రక్తప్రమాణము తగ్గుట (hypovolemia) వలనను, రక్తనాళములలో బిగుతు తగ్గుట (decreased vasomotor tone) వలనను స్థితిప్రేరిత అల్ప రక్తపీడనము (postural hypotension) కలిగి మెదడునకు రక్తప్రసరణ తగ్గి యీ మూర్ఛ కలుగుతుంది. వెల్లకిల పడుకోబెట్టి కాళ్ళు ఎత్తిపెట్టి ఉంచగానే రక్తపీడనము తేరుకొని వారికి స్మారకము కలుగుతుంది. ఈ స్థితి నుంచి 15, 20 నిమిషములలో పూర్తిగా తేరుకుంటారు. వీరిచే ఉప్పుతో కూడిన ద్రవపదార్థములను సేవింపజేసి చల్లని ప్రదేశములలో విశ్రాంతి చేకూర్చాలి. హృదయ సంబంధ వ్యాధులు వలన కూడ అపస్మారము కలుగవచ్చును. హృద్రోగలక్షణములు, ఆ అవకాశములు కలవారిలోను, వయస్సు మీఱినవారిలోను హృద్రోగములకై శోధించాలి. అధిక ఉష్ణ ముచే కలుగు తీవ్రరుగ్మతలు : వడ బడలిక ( Heat exhaustion ) :

తీవ్రవ్యాయామము, శారీరకశ్రమ, క్రీడల వలన ఎక్కువైన జీవవ్యాపార క్రియకు (metabolism)  పరిసరముల అధిక ఉష్ణోగ్రత తోడయినపుడు వడ బడలిక (heat exhaustion) కలిగే అవకాశము ఉన్నది. ఎక్కువ వేడికి చెమట ఎక్కువయి జల, లవణ నష్టము కలుగుతుంది. వడబడలిక కలిగిన వారికి అలసత్వము, ఒళ్ళు తూలడము, ఒంట్లో నలత, తలనొప్పి, వమన భావన (nausea), వాంతులు కలుగవచ్చు. చెమట బాగా పట్టి చర్మము చల్లబడుతుంది. శరీరాంతర ఉష్ణోగ్రత (core body

318 ::