పుట:Hello Doctor Final Book.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29. ఉష్ణ సంబంధ రుగ్మతలు ( Heat related illnesses ) శరీరములో ఉష్ణనియంత్రణ కేంద్రము మెదడులో హైపోథలమస్ లో (Hypothalamus)  ఉంటుంది. ఉష్ణము శరీరములో అధికముగా జనించినపుడు, వాతావరణ ఉష్ణము ఎక్కువగా ఉన్నపుడు, శరీరము అధిక ఉష్ణమును బయటకు ప్రసరించుటలో లోపము ఉన్నచో ఉష్ణ సంబంధ రుగ్మతలు కలుగుతాయి.

అధిక ఉష్ణోగ్రతలలో పనిచేసేవారిలోను, వ్యాయామము, క్రీడలలో పాల్గొనేవారిలోను, సైనికులలోను, దళసరి వస్త్రధారణ చేసేవారిలోను, గృహవసతి లేనివారిలోను, ఇతర అనారోగ్యములు కలవారిలోను, మద్యము, యితర మాదకద్రవ్యములు వాడేవారిలోను, మానసిక ఔషధములు, యితర ఔషధములు వాడేవారిలోను అధిక ఉష్ణము వ్యాధులు కలిగించే అవకాశములు ఎక్కువ.

ఉష్ణము శరీరమునుంచి దేహానికి అంటిఉన్న దుస్తులు మొదలగు చల్లని వస్తువులకు వహనము (conduction ) వలన, దేహముపై ప్రసరించు గాలికి సంవహనము(convection) వలన, విద్యుత్ అయస్కాంత తరంగముల (electromagnetic waves) వికిరణము (radiation) వలన, చెమట ఆవిరి చెందుట వలన బయటకు ప్రసరింపబడుతుంది. వాతావరణపు ఉష్ణోగ్రత పెరిగినపుడు, కండరముల శ్రమ పెరిగినపుడు, శరీర వ్యాపార క్రియ ( metabolism) పెరిగినపుడు స్వేదము ఎక్కువగా స్రవించి ఉష్ణము బయటకు ప్రసరించుటకు, దోహదపడుతుంది. హృదయ వేగము, సంకోచము (contractility) పెరిగి, హృదయము నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తప్రమాణము (cardiac output) పెరిగి, చర్మమునకు రక్తప్రసరణ పెరిగి ఉష్ణప్రసరణను పెంచుతాయి. జీర్ణమండలము, ఇతర ఉదరాంతర అవయవములలో (viscera)  రక్తనాళములు ఎక్కువగా సంకోచించుట వలన చర్మమునకు రక్తప్రసరణ పెరుగుతుంది. చెమట ఉత్పత్తి

316 ::