పుట:Hello Doctor Final Book.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుర్తించవచ్చును. ఈ చిత్రీకరణము Dual Energy X-ray absorptiometry Scan తో (DEXA Scan) చేస్తారు. ఎక్స్ రేలను రెండు భిన్న మోతాదులలో వాడి తుంటి ఎముకలను (hips), వెన్నెముకను (spine) చిత్రీకరిస్తారు. చిత్రములతో ఎముకల సాంద్రతను (bone density) గణించి సాంద్రతకు T score, Z score లను ఆపాదిస్తారు.

ఒక వ్యక్తి అస్థిసాంద్రతకు (Bone density), యువజనుల సగటు అస్థిసాంద్రతకు,  గల ప్రమాణ వ్యత్యాసము (standard deviation) ఆ వ్యక్తి T- score తెలియపరుస్తుంది . T- score, - 2.5  కంటె తక్కువ ఉంటే అస్థిసాంద్ర క్షీణత (osteoporosis ; గుల్ల ఎముకల వ్యాధి)  నిర్ధారిస్తారు.

T - score,  -1 నుంచి -2.5 వఱకు ఉంటే అది ఎముకల బలహీనతను (osteopenia) ధ్రువపఱుస్తుంది.

ఒక వ్యక్తి అస్థిసాంద్రతకు, ఆ వ్యక్తికి సమాన వయస్సు, బరువు, లింగములకు చెందిన మనుజుల సగటు అస్థి సాంద్రతకు, కల  ప్రమాణ వ్యత్యాసము (standard deviation) ఆ వ్యక్తి  Z- score తెలుపుతుంది.

40 సంవత్సరముల వయస్సు లోపలి వారిలో గుల్ల ఎముకల వ్యాధిని నిర్ధారించుటకు  Z- scores పరిగణనలోనికి తీసుకుంటారు.

గుల్ల ఎముకల వ్యాధి కలిగే అవకాశములు ఉన్నవారిలో అస్థిసాంద్ర చిత్రీకరణము (Bone Mineral Densitometry) అవసరము. 65 సంవత్సరములు పైబడిన స్త్రీలలోను, 70 సంవత్సరములు పైబడిన పురుషులు అందఱిలోను అస్థిసాంద్ర చిత్రీకరణములు చేసి పరిశీలించుట వలన గుల్ల ఎముకలవ్యాధి ( osteoporosis) కలవారిని ఎముకలు విఱుగక మున్నే గుర్తించి వారికి చికిత్సలు చేయుట వలన ఎముకలు విఱుగుట (అస్ధిభంగములు, fractures) తగ్గించగలుగుతాము.

చికిత్స :

కాల్సియమ్ :  గుల్ల ఎముకల వ్యాధిని నివారించుటకు, చికిత్సకు కూడా తగినంత కాల్సియమ్  వాడవలసి ఉంటుంది. కాల్సియమ్ ఎంత

311 ::