పుట:Hello Doctor Final Book.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉరస్సులో క్రింది వెన్నుపూసలు, నడుములో వెన్నుపూసలు వాటికి  పైన, క్రింద ఉన్న వెన్నుపూసల మధ్య  అణచబడి కుచించినపుడు, వాటిని  సంపీడన అస్థి భంగములుగా (compression fractures) పరిగణిస్తారు. వాటి వలన దీర్ఘకాలపు నడుము నొప్పులు, ఎత్తు తగ్గుట, గూని, చలనములో ఇబ్బంది  కలుగ గలవు. వెన్నుపాము, వెన్నునాడులు ఒత్తిడికి గుఱి అయే అవకాశము కూడా ఉన్నది.

వైద్యులు పరీక్ష చేసినపుడు రోగి ఎత్తు తగ్గిఉండుట, అంగస్థితిలో మార్పు, గూని (kyphosis ),  వెన్నెముకలో పక్క వంకరలు (scoliosis), వెన్నెముకలో నొప్పులు కనుగొనే అవకాశము ఉన్నది.

పరీక్షలు : రక్తపరీక్షలతో రక్తకణముల గణనములు, కాల్సియమ్, ఫాస్ఫేట్ లతో సహా విద్యుద్వాహక లవణముల (electrolytes) విలువలు, మూత్రాంగ వ్యాపార ప్రమాణములు (blood urea nitrogen and creatinine), ఆల్కలైను ఫాస్ఫటేజ్ (serum Alkaline Phosphatase) విలువ, కాలేయ వ్యాపార పరీక్షలు (liver function tests), గళగ్రంథి వ్యాపార పరీక్షలు (thyroid function tests), 25- హైడ్రాక్సీ విటమిన్ డి విలువలు, పురుషులలో టెష్టోష్టెరోన్ విలువలు తెలుసుకోవాలి. సీలియక్ వ్యాధి నిర్ణయమునకు tissue transglutaminase antibodies విలువలకు రక్తపరీక్షలు చేయాలి.  

రక్తద్రవములో  కాల్సియమ్ (serum calcium) విలువలు పెరిగి ఉంటే రక్తద్రవములో సహగళగ్రంథి స్రావకపు  (parathyroid hormone) విలువలు పరీక్షించాలి. రక్తపరీక్షలు అన్నీ బాగుంటే ఇతర వ్యాధి లక్షణములు లేనపుడు గుల్ల ఎముకల వ్యాధిని ప్రాథమిక వ్యాధిగా పరిగణించవచ్చును.

అస్థిసాంద్రత చిత్రీకరణము ( Bone Mineral Densitometry ):

శరీరములో ఎముకల చిత్రీకరణము చేసి అస్థిసాంద్రతను (Bone density) నిర్ణయించి అస్థి (సాంద్ర) క్షీణత (osteoporosis) గల వారిని

310 ::