పుట:Hello Doctor Final Book.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సహగళ గ్రంథుల చైతన్యము ఎక్కువయినచో వాటి స్రావక ప్రభావము వలన ఎముకల నుంచి కాల్సియమ్ ఎక్కువగా సంగ్రహించబడుతుంది. రక్తములో కాల్సియమ్ ప్రమాణములు పెరుగుతాయి. ఎముకలలో సాంద్రత తగ్గి గుల్ల ఎముకల వ్యాధి (osteoporosis) కలుగుతుంది.

ఇతర వినాళగ్రంథుల వ్యాధులు :

ఎడ్రినల్ గ్రంథులలో వెలుపలి భాగపు (adrenal cortex) స్రావకములు కార్టికోష్టీరాయిడులు ఎక్కువయి వచ్చే కుషింగ్ సిండ్రోమ్ (Cushing syndrome), గళగ్రంథి ఆధిక్యత (hyperthyroidism), బీజగ్రంథులహీనత (hypogonadism), పిట్యూటరీ గ్రంథి స్రవించు ప్రవర్ధన స్రావకపు (Growth hormone) ఆధిక్యత, పిట్యూటరీ గ్రంథిలో కలిగే  ప్రొలాక్టినోమా (Prolactinoma) అనే పెరుగుదల  వలన కూడా గుల్ల ఎముకల వ్యాధి  కలుగవచ్చును. అండాశయములు (ovaries) తొలగించిన స్త్రీలలోను, ఋతుస్రావములు తప్పిన స్త్రీలలోను గుల్ల ఎముకల వ్యాధి  ఎక్కువగా కలుగుతుంది.

2. రక్తోత్పాదన వ్యాధులు ( hematopoietic disorders ) :

ఎముకల మజ్జలో (bone marrow) రక్తము ఉత్పత్తి అవుతుంది. లవిత్రకణ వ్యాధి (sickle cell disease), థలసీమియా (thalassemia), Multiple myeloma, leukemias, lymphomas, polycythemia vera వంటి వ్యాధులలో అస్థిసాంద్ర క్షీణత (Osteoporosis) కలుగవచ్చును.

3. సంధాన కణజాల వ్యాధులు ( connective tissue disorders ) : a). అస్థికణజాల ఉత్పత్తి దోషము ; పెళుసు ఎముకల వ్యాధి ( Osteogenesis imperfecta ; Brittle bone disease ) :

ఈ వ్యాధి జన్యుపరముగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధిలో ఎముకల మాతృక (matrix) లోను, ఇతర అవయవములలోను కొల్లజెన్-1 (collagen-1) అనే సంధానపు మాంసకృత్తి (connective tissue pro:: 306 ::