పుట:Hello Doctor Final Book.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్మాణ ప్రక్రియ (bone formation), శిథిల ప్రక్రియ (bone resorption) జరుగుతుంటాయి. ఎముకల నిర్మాణ ప్రక్రియలో అస్థినిర్మాణ కణములు (osteoblasts), ఎముకల శిథిల ప్రక్రియలో అస్థిశిథిల కణములు (osteoclasts) పాల్గొంటాయి.

గరిష్ఠ అస్థిరాశి (peak bone mass) తక్కువగా ఉన్నవారిలోను, ఎముకల నిర్మాణ ప్రక్రియ తగ్గిన వారిలోను, ఎముకల శిథిల ప్రక్రియ హెచ్చయిన వారిలోను ఎముకలు బలహీనపడుతుంటాయి.

కారణములు :

వయస్సుతో కలిగే  గుల్ల ఎముకల వ్యాధిని ప్రాథమిక అస్థిసాంద్ర క్షీణతగా (Primary Osteoporosis)  పరిగణిస్తారు. ఆహారములో కాల్సియం, విటమిను డి లోపములు ఈ వ్యాధి కలుగుటకు దోహదపడుతాయి. ఇతర వ్యాధుల వలన కలిగే గుల్ల ఎముకల వ్యాధిని ద్వితీయ అస్థిసాంద్ర క్షీణతగా ( Secondary Osteoporosis ) పరిగణిస్తారు. గుల్ల ఎముకల వ్యాధిని కలిగించు ఇతర వ్యాధులు : 1 . వినాళగ్రంథి వ్యాధులు ( Endocrine disorders ) : సహగళగ్రంథి ఆధిక్యత ( Hyperparathyroidism ) :

కంఠములో ఉండే గళగ్రంథులకు (Thyroid glands) వెనుక భాగములో ఆనుకొని చెఱి ఒకపక్క మీది భాగములో ఒకటి, క్రింద భాగములో ఒకటి, మొత్తము నాలుగు సహగళ గ్రంథులు ( Parathyroid glands) ఉంటాయి. ఇవి పరిమాణములో 6 మి.మీ పొడవు 4 మి.మీ. వెడల్పు, 2 మి.మీ మందము కలిగి ఉంటాయి. ఈ గ్రంథులు శరీరములోను రక్తములోను కాల్సియమ్ (Calcium), ఫాస్ఫేట్ (Phosphate) ప్రమాణములను వాటి వినాళ స్రావకముతో (Parathyroid hormone) నియంత్రిస్తాయి. ఎముకల జీవవ్యాపారము (metabolism) కూడా సహగళ గ్రంథి స్రావకముపై ఆధారపడి ఉంటుంది.

305 ::