పుట:Hello Doctor Final Book.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

tein ) ఉత్పత్తిలో దోషము ఉండుట వలన గుల్ల ఎముకల వ్యాధి కలిగి, ఎముకలు పెళుసుగా ఉండి,  సులభముగా విఱుగుతుంటాయి. వీరి కన్నుల శ్వేతపటలములు కొల్లజెన్-1 లోపము వలన  నీలివర్ణములో ఉంటాయి, వీరిలో వినికిడి లోపములు, వదులు కీళ్ళు, దంతములలో లోపములు, శ్వాసలో ఇబ్బంది మొదలగు ఇతర లక్షణములు వ్యాధి నిర్ధారణకు తోడ్పడుతాయి.

b). మూత్రములో హోమోసిష్టి న్ విసర్జ న ( homocystinuria ) :

జన్యుపరముగా కలిగే ఈ సంధానకణజాల వ్యాధిలో (connective tissue disorder) హోమోసిష్టిన్ అను ఎమైనో ఆమ్లము (amino acid) మూత్రములో అధికముగా విసర్జింపబడుతుంది. వీరిలో గుల్ల ఎముకల వ్యాధి తఱచు కలుగుతుంది.

4. మూత్రాంగ వ్యాధులు ( Renal disorders ) :

దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము (Chronic renal failure), మూత్ర నాళికలలో ఆమ్లవిసర్జన లోపము వలన కలుగు మూత్రనాళిక ఆమ్లీకృతము (Renal tubular acidosis), కాల్సియమ్ అధిక విసరన ్జ (hypercalciurea) వ్యాధులలో కాల్సియమ్ విసర్జన ఎక్కువగా ఉండి కాల్సియమ్ నష్టము కలిగి అస్థిసాంద్ర క్షీణత (osteoporosis ) కలుగుతుంది.

5. జీర్ణమండల వ్యాధులు ( gastrointestinal disorders )

జఠర ఖండనము (gastrectomy) జరిగిన వారిలోను, సీలియక్ వ్యాధి (celiac disease), ప్రాథమిక  పైత్యనాళిక నారంగ కాలేయవ్యాధి (primary biliary cirrhosis), ఇతర అజీర్తి (indigestion), సంగ్రహణ వ్యాధులు (assimilation) కలవారిలోను ప్రేవులలో కాల్సియమ్  సంగ్రహణము (absorption) తగ్గుతుంది. వీరిలో గుల్ల ఎముకల వ్యాధి  కలిగే అవకాశములు హెచ్చు .

307 ::