పుట:Hello Doctor Final Book.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్పత్తిలో లోపము కలుగవచ్చును. Diphillobothrium latum వంటి పరాన్నభుక్తుల వలన కూడా బి- 12 లోపము వస్తుంది.

లక్షణములు :

విటమిన్ బి - 12 లోపించిన వారిలో నాడీమండల వ్యాధులు సాధారణముగా రక్తహీనత కంటె ముందుగా కనిపిస్తాయి. చేతులు, పాదములలో తిమ్మిరులు, ప్రకంపన స్పర్శ లోపము (loss of vibratory sense), స్పర్శ లోపము (loss of touch sensation), దూరనాడుల తాపములు (Peripheral neuritis), అస్థిరత్వము (Instability) బి -12 లోపము వలన రక్తహీనతకు ముందుగానే కనిపించవచ్చును.

రక్త పరీక్షతో బి -12 విలువలు తెలుసుకొని, లోపము ఉంటే విటమిన్ బి -12 ని అధికమోతాదులలో బిళ్ళలుగా గాని, సూదిమందుగా గాని యిచ్చి లోపమును నివారించవచ్చును. మౌలిక పదార్థములు ఇనుము, ఫోలికామ్లము, విటమిన్ బి-12 లోపముల వలన, మూత్రాంగ వ్యాధిగ్రస్థులలో రక్తోత్పాదిని (Erythropoietin) లోపము వలన, ఎముకలమజ్జ వ్యాధుల వలన రక్తపు ఉత్పత్తి తగ్గగలదు. కర్కట వ్రణముల వలన, శరీర రక్షణ వ్యవస్థ లోపములు (Immune deficiency)  కలవారిలోను, దీర్ఘకాల వ్యాధులు గలవారిలోను రక్తపు ఉత్పత్తి తగ్గవచ్చును. థలసీమియా (Thalassemia) జన్యుపరముగా సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధిగ్రస్థులలో గ్లోబిన్ గొలుసుల ఉత్పత్తి లోపము వలన రక్తహీనత కలుగుతుంది.

రక ్తవిచ్ఛేదన రక ్తహీన వ్యాధులు ( Hemolytic anaemias ) :

జన్యుపరముగా వచ్చే విరూప రక్తకణ వ్యాధులు అయిన లవిత్రకణ రక్తహీన వ్యాధిలోను (Sickle cell anemia), వంశపారంపర్య గోళకణవ్యాధి లోను (Hereditary Spherocytosis), అసాధారణపు హీమోగ్లోబినుల (Hemoglobinopathies) వలన, రక్తకణముల ఆయువు తగ్గి అవి త్వరితముగా విచ్ఛేదించబడతాయి. శరీర రక్షణ వ్యవస్థ (Immu:: 301 ::