పుట:Hello Doctor Final Book.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

nological system) కు స్వ (Self) పర (External) విచక్షణా లోపము కలుగుతే స్వయంప్రహరణ వ్యాధులు (Autoimmune diseases) వలన రక్తకణముల విచ్ఛేదనము విశేషముగా జరుగవచ్చును. ఆ వ్యాధులలో రక్తహీనత కలుగుతుంది. కృత్రిమ హృదయ కవాటములు ఉన్న వారిలో రక్తకణ విచ్ఛేదనము కలుగవచ్చును. గ్లూకోజ్-6 ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్ లోపము ఉన్న వారిలో కొన్ని మందుల వలన,  ఫావా చిక్కుళ్ళ వలన ఎఱ్ఱకణముల ఛేదనము కలిగి రక్తహీనత కలుగవచ్చును. రక్తవిచ్ఛేదనము విశేషముగా జరిగినపుడు రక్తహీనముతో (anemia) బాటు బిలిరుబిన్ విలువలు పెరిగి పచ్చకామెరులు (jaundice) కూడా కలిగే అవకాశము ఉన్నది.

ఇచ్చట పేర్కొన్న కారణాలే గాక అనేక యితర వ్యాధుల వలన కూడా రక్తహీనత కలుగవచ్చును. ఇనుము లోపము వలన కలిగే రక్తహీనతను తఱచు చూస్తాము. వివిధ శోధన పరీక్షలు, ఎముక మజ్జ కణపరీక్షలు (Bone marrow biopsy) రక్తహీనత కలిగిన వారికి అవసరము కావచ్చును. కారణము కనుగొన్న పిదప వైద్యులు తగిన చికిత్సలు చేస్తారు.

ఆహార పదార్థా లు :

సాధారణముగా మనకు వివిధ ఆహార పదార్థాల ద్వారా మన అవసరములకు కావలసిన ఇనుము, ఫోలికామ్లము, బి 12 విటమినులు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు అవసరాలు పెరుగుట వలన, ఇనుము, ఫోలికామ్లములను మందుల రూపములో యివ్వవలసి ఉంటుంది. ఇనుము తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుళ్ళు, పప్పులు, వేరుసెనగ, గుమ్మడి విత్తులు, ఫలములు, మాంసము, చేపలు, గ్రుడ్లు ద్వారా లభ్యమవుతుంది. ఫోలికామ్లము ఆకుకూరలు, కాబేజీ, బ్రాకెలీ, చిక్కుళ్ళు, పప్పులు, నారింజ, అరటి, మిగిలిన ఫలముల ద్వారా లభ్యమవుతుంది.

302 ::