పుట:Hello Doctor Final Book.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

otrexate, Triamterene, Sulphasalazine, Barbiturates, Carbamazepine, Pyrimethamine, Metformin,) వలన ఫోలికామ్లపు లోపము కలుగవచ్చును. రక్తశుద్ధి (Hemodialysis) చికిత్స పొందే వారికి ఫోలికామ్లమును సరఫరా చెయ్యాలి. రక్తవిచ్ఛేదన రక్తహీన వ్యాధిగ్రస్థులకు ఫోలికామ్లమును అందజేయాలి.

లక్షణములు :

ఫోలికామ్లము లోపించిన వారి రక్తకణాల పరిమాణము ఎక్కువగా (పృథుకణత్వము; macrocytosis) ఉంటుంది. అలసట, నీరసము, ఎక్కువ చిరాకు, నిద్రలేమి, మానసిక కుంగుదల, మతిమఱపు కొన్ని ఫోలికామ్లలోపపు వ్యాధి లక్షణాలు. వీరి రక్తపరీక్షలలో ఫోలికామ్లపు విలువలు తక్కువగా ఉంటాయి. ఫోలికామ్లము సరఫరా చేసి లోపమును సరిదిద్దవచ్చును. ఫోలికామ్లమును కనుగొన్న శాస్త్రజ్ఞులు శ్రీ యెల్లాప్రగడ సుబ్బారావు గారు తెలుగువారే అగుట మనకు గర్వకారణము.

విటమిన్ బి -12 లోపము :

విటమిన్ బి -12 లోపించిన వారిలో కూడా   పృథుకణ రక్తహీనత కలుగుతుంది. ఇది ప్రమాదకర రక్తహీనతగా (Pernicious anaemia) పేరు గడించింది. విటమిన్ బి-12 ని బాహ్యాంశముగా (Extrinsic factor) పరిగణిస్తారు. విటమిన్ బి -12 గ్రహించుటకు అవసరమయే అంతరాంశము (Intrinsic factor) జఠరములో ఉత్పత్తి అవుతుంది. బాహ్యాంశమైన బి - 12. అంతరాంశముతో కలిసి, చిన్నప్రేవుల చివరి భాగములో (Ileum) గ్రహించబడుతుంది.

ఆహారములో బి-12 విటమిన్ లోపించిన వారిలోను, జఠరఛేదన (gastrectomy), ఆంత్రఛేదన (resection of small intestines) చికిత్సలు జరిగిన వారిలోను బి-12 లోపము కలుగుతుంది. వృద్ధులలో జఠర క్షయము (Gastric atrophy) వలన అంతరాంశము ఉత్పత్తి జరుగక బి-12 గ్రహణమునకు అవరోధము కలుగవచ్చును. స్వయంప్రహరణ రక్షణ వ్యాధి (Autoimmune disorder) వలన కూడా అంతరాంశము

300 ::