పుట:Hello Doctor Final Book.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తవర్ణకము (hemoglobin), రక్తసాంద్రత (Hematocrit)  తగ్గి ఉంటాయి. ఎఱ్ఱరక్తకణాల పరిమాణము తగ్గుతుంది. వీరిలో లఘుకణత్వము (Microcytosis) ప్రస్ఫుటము అవుతుంది. ఎఱ్ఱకణములలో రక్తవర్ఱక ప్రమాణము తగ్గి వర్ణహీనత (hypochromia) కలుగుతుంది. రక్తములో ఇనుము విలువలు, ఫెరిటిన్ విలువలు తగ్గి ఉంటాయి. రోగుల చరిత్ర, భౌతికపరీక్షలతో బాటు మలమును అగోచర రక్తమునకు (Occult blood), పరాన్నభుక్తులకు, వాటి అండములకు (Ova and Parasites) పరీక్షించాలి. జఠరాంత్రదర్శన, (Gastroduodenoscopy) బృహదాంత్ర దర్శన (Colonoscopy) పరీక్షల వలన అన్నవాహికలోను, జఠరములోను, ఆంత్రములలోను జీర్ణవ్రణములు (peptic ulcers), కంతులు (polyps), కర్కటవ్రణములు (cancers), ఆంత్రబుద్బుదములు (diverticuli)  కనుగొనబడుతాయి. మూలకారణముల చికిత్స వీరికి అవసరము. రక్తలోపము అతి తీవ్రమైనవారికి పరరక్తదానము (Blood transfusion) అవసరము. ఇతరులకు ఇనుము లవణరూపములలో (iron salts) సరఫరా చెయ్యాలి.  ఫెఱ్ఱస్ సల్ఫేట్ ను సాధారణముగా వాడుతారు.  వాంతిభావన, కడుపులో వికారము, వాంతులు వచ్చి ఫెఱ్ఱస్ సల్ఫేట్ ను సహించలేనివారు ఫెఱ్ఱస్ గ్లుకొనేట్,  కాని ఫెఱ్ఱస్ ఫ్యుమరేట్ గాని వాడుకోవచ్చును. ఇనుముతో బాటు అధిక రక్తోత్పత్తికి అవసరమయిన ఫోలికామ్లమును కూడా వైద్యులు సరఫరా చేస్తారు. పృథుకణ రక్తహీనతలు (Macrocytic anaemias) ఫోలికామ్లము లోపము లేక విటమిన్  బి - 12 లోపముల వలన కలుగుతాయి ఫోలికామ్లపు లోపము :

గర్భిణీస్త్రీలకు,  పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఫోలికామ్లపు అవసరాలు మూడింతలు పెరుగుతాయి. అందువలన వారికి ఇనుముతో బాటు ఫోలికామ్లము కూడా సరఫరా చెయ్యాలి. మద్యపానము హెచ్చయిన వారిలోను, వృద్ధులలోను, మానసిక వ్యాధిగ్రస్థులలోను, బరువు తగ్గుటకై విపరీతపు మితాహారములలో ఉన్నవారిలోను, అజీర్తి వ్యాధిగ్రస్థులలోను, ఫోలికామ్లపు లోపములు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఔషధముల (Meth:: 299 ::