పుట:Hello Doctor Final Book.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కీళ్ళనొప్పులకు వాడే మందులు, ఏస్పిరిన్, యితర ఔషధములు, హెలికోబాక్టర్ పైలొరై (Helocobacter Pylori) అనే సూక్షజీవుల వలన జఠరతాపములు కలుగుతాయి], పెద్దప్రేవులలో కలిగే ఆంత్ర బుద్బుదాలు (Diverticulosis), కంతులు (Polyps), మూలవ్యాధి (Haemerrhoids), ఆంత్రములలో చేరిన కొంకిపురుగులు (Hookworms) వంటి పరాన్నభుక్తుల (Parasites) వలన దీర్ఘకాలములోను, త్వరితగతిలోను రక్తనష్టము కలుగ వచ్చును. ప్రమాదాల వలన కలిగే తీవ్రగాయాల వలన, శస్త్రచికిత్సలలోను రక్తనష్టము కలుగవచ్చును. అయస్సు లోప రక ్తహీనత ( Iron deficiency anaemia ) :

పైన పేర్కొన్న కారణాల వలన శరీరములో ఇనుము నిల్వలు తగ్గుటచే రక్తహీనత కలుగుతుంది. గర్భిణీస్త్రీలలో రక్తపు అవసరము ఎక్కువయి రక్తపు ఉత్పత్తి పెరుగుతుంది. వారికి దైనందిక ఇనుము అవసరాలు పెరుగుతాయి. వారికి ఇనుము లవణరూపములో అదనముగా అందించకపోతే ఇనుము లోపించి  పాండురోగము కలుగుతుంది. శిశువులలో కూడా ఇనుము లోపము కలుగవచ్చును. ఆంత్రవ్యాధులు, క్లోమవ్యాధులు (Pancreatic disorders), జఠరఛేదన (Gastric resection), ఆంత్రఛేదన (Gut resection) చికిత్సల వలన అజీర్తి (Malabsorption) కలిగి ఇనుము (iron) గ్రహించబడకపోయినా అయస్సు లోపము కలుగుతుంది. లక్షణములు :

ఇనుము లోపించి రక్తహీనత కలిగితే వారికి రక్తహీనత తీవ్రత బట్టి నీరసము, అలసట, ఆయాసము, ఒంట్లో నలతభావము, పొడచూపుతాయి. రక్తలోపము తీవ్రమయితే ఒంటిపొంగులు కలుగవచ్చును. వీరికి వింత రుచులు కలిగి మట్టి, పిళ్ళు, మంచుగడ్డలపై రుచి కలుగుతుంది. రక్తహీనత వలన వీరు వర్ణము కోల్పోయి తెల్లబడుతారు. అందువలనే రక్తహీనతకు పాండురోగము అనే పేరు ప్రశస్తి చెందింది. రక్తపరీక్షలలో వీరి ఎఱ్ఱకణముల సంఖ్య తగ్గి ఉంటుంది. రక్తములో

298 ::