పుట:Hello Doctor Final Book.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ma) పైకి చేరుకుంటుంది. పేరుకొన్న కణ ఘనపరిమాణమును రక్త (కణ) సాంద్రతగా (Hematocrit) పరిగణిస్తారు. రక్తసాంద్రత సాధారణముగా పురుషులలో 46 శాతము, స్త్రీలలో 42 శాతము ఉంటుంది. రక్తహీనము ఉన్న వారిలో రక్తసాంద్రత తక్కువగా ఉంటుంది. రక్తకణములు ఎముకల మజ్జలో ఉత్పత్తి అవుతాయి. పిల్లలలో అన్ని ఎముకల మజ్జలలోను రక్తకణముల ఉత్పత్తి జరుగుతుంది. పెద్దలలో కపాల అస్థికలు, రొమ్ముటెముకలు, ప్రక్కటెముకలు, కటియెముకలు, దీర్ఘాస్థుల చివరి భాగముల మజ్జలలోను రక్తకణముల ఉత్పత్తి జరుగుతుంది. మూత్రాంగములలో (kidneys) ఉత్పత్తి అయే రక్తోత్పాదిని (Erythropoietin) అనే రసాయనము ఎఱ్ఱకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మూత్రాంగముల వ్యాధి, వైఫల్యము ఉన్న వారిలో రక్తోత్పాదిని (Erythropoietin) ఉత్పత్తి తక్కువగుటచే వారిలో రక్తహీనత కలుగుతుంది.

ఎఱ్ఱరక్తకణాలలో ఉండే హీమోగ్లోబిన్ లో- హీం (Heme) అనే వర్ణకము (Pigment) గ్లోబిన్ అనే మాంసకృత్తితో సంయోగమయి ఉంటుంది. హీం ఉత్పత్తికి ఇనుము (Iron) అవసరము. ఎఱ్ఱకణాల ఉత్పత్తికి ఇనుము, ఫోలికామ్లము, విటమిన్ బి -12 లు అవసరము. పాండురోగ కారణములు

రక్తహీనము ఎఱ్ఱకణాల ఉత్పత్తి లోపము వలన, రక్తనష్టము (Blood loss) వలన, రక్తకణ విచ్ఛేదనము (Hemolysis) వలన కలుగుతుంది. రక ్తనష్ట ము :

తరుణస్త్రీలలో ఋతుస్రావము అధిక మయితే రక్తహీనము కలుగుతుంది. జీర్ణమండలము (Alimentary tract) ద్వారా రక్తనష్టము కలుగవచ్చును. జీర్ణాశయము (Stomach), ప్రథమాంత్రములలో (Duodenum) జీర్ణవ్రణములు (Peptic ulcers), జీర్ణమండలములో వివిధ కర్కటవ్రణములు (Cancers), అన్ననాళములో ఉబ్బుసిరలు  [Esophageal varices - ఇవి నారంగ కాలేయ వ్యాధిగ్రస్థులలో (Cirrhosis of Liver) కలుగుతాయి], జఠరతాపము (Gastritis) [మద్యపానము,

297 ::