పుట:Hello Doctor Final Book.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

phy), అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము (magnetic resonance imaging), పెట్స్కానులు, పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్ష (colonoscopy), అన్నవాహిక జఠర అంతర్దర్శన (esophago gastroscopy), పుపుసనాళ అంతర్దర్శన పరీక్ష (bronchoscopy),  కర్కటవ్రణములను కనుగొనుటకు ఉపయోగ పడుతాయి. వ్రణములు, కనుక్కొన్నాక వాటినుంచి కణపరీక్షలు (Biopsies) చేసి వ్యాధిని నిర్ణయిస్తారు. వివిధ పరీక్షలతో ఈ కర్కటవ్రణములు యితర అవయవములకు వ్యాపించాయో లేదో నిర్ణయించి తగిన చికిత్సలు చేస్తారు.

మిగిలిన వైజ్ఞానికశాస్త్రాల ఆలంబనముగా వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతుంది. ప్రపంచము అంతటా వైజ్ఞానిక పరిశోధకులు విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఆరంభదశలో కనుగొన బడిన  కర్కటవ్రణములు చికిత్సకు లొంగే అవకాశము ఉన్నది. అంత్యదశలలో కనుగొన్న కర్కటవ్రణములకు సంపూర్ణ చికిత్సలు సాధ్యము కావు. అటువంటి పరిస్థితులలో ఉపశమన చికిత్సలకే అవకాశము ఉంటుంది.

294 ::