పుట:Hello Doctor Final Book.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లొంగుతాయి. భారతదేశములో యీ పెద్దప్రేవుల అంతర్దర్శన పరీక్షలు (కొలొనోస్కోపులు) శోధన పరీక్షలుగా (screening tests) ప్రాచుర్యము పొందినట్లు లేదు. దీర్ఘకాలిక పరిశోధనలు చేస్తే వీటి ఉపయుక్తత తెలిసే అవకాశము ఉంది.

పొగత్రాగేవారిలో తరచు శ్వాసకోశపు చిత్రాలు  తీస్తే శ్వాసకోశ కర్కటవ్రణములను తొలిదశలలో కనుక్కొనే అవకాశము కొంత ఉండవచ్చును. సంవత్సరానికో సారి ఊపిరితిత్తులకు గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణములు (Low dose Computerized Axial Tomography Scan) చేస్తే యీ కాన్సరులను త్వరగా కనుక్కొనే అవకాశము పెరుగుతుంది. కాని చాలామందిలో శ్వాసకోశ  కర్కటవ్రణాలు (Lung Cancers) బయటపడేటప్పటికే అవి వ్యాప్తిచెంది ఉంటాయి. ఒక పదిహైను శాతము మందిలో శస్త్రచికిత్సకు అవకాశము ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తొలిదశలలో కనుక్కోబడక పోవుటచే నయమయే శ్వాసకోశ కర్కటవ్రణములు చాలా తక్కువ ఉంటాయి.

రక్తములో ఉన్న ప్రాష్టేట్ స్పెసిఫిక్  ఏంటిజెన్ (Prostate Specific Antigen) పరీక్ష ప్రతి రెండు సంవత్సరములకు 55 - 69 సంవత్సరముల వయస్సులో ఉన్న పురుషులలో చేస్తే  ప్రాష్టేట్ కర్కటవ్రణములను (Prostatic Cancers) సకాలములో గుర్తించవచ్చును. చాలా మందిలో ప్రాష్టేట్ కాన్సరులు నెమ్మదిగా పెరుగుటచే పెక్కుశాతముమంది చికిత్స లేకపోయినా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశము ఉన్నది. P.S.A పరీక్షలతో సత్వరముగా కనుక్కొని చికిత్స చేస్తే మరింత ప్రయోజనము చేకూరవచ్చును.

కర్కటవ్రణములు ఆరంభదశలో ఉన్నపుడు యే బాధా కలిగించక పోవచ్చును. అవి పెరుగుతున్నకొలది వివిధ లక్షణాలు పొడచూపుతాయి. సాధారణముగా అవి ఏ అవయవాలలో ఉంటాయో ఆ అవయవాలకు సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. ఆకలి తగ్గుట, బరువు తగ్గుట, కర్కటవ్రణ లక్షణాలు. ఏ అవయవ సంబంధమైన వ్యాధిలక్షణాలు కనిపించినా తగిన శోధన పరీక్షలు చేయుట వలన అవి ప్రస్ఫుటము అవవచ్చును. రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, గణనయంత్ర త్రిదిశ చిత్రీకరణము (computerized axial tomography), శ్రవణాతీత ధ్వని చిత్రీకరణ (ultrasonogra:: 293 ::