పుట:Hello Doctor Final Book.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోవచ్చును. ఆ స్థితులలో వైద్యులు  ఉపశమన చికిత్సలే  (palliative care) చేయగలుగుతారు. శస్త్రచికిత్స, వికిరణచికిత్సలు (Radiation therapy), రసాయన (ఔషధ) చికిత్సలు (Chemotherapy), ప్రతిరక్షిత చికిత్సలు (Immunotherapy) వ్యాధినివారణకు, ఉపశమన చికిత్సలకు వాడుతారు.

కర్కటవ్రణములను (cancers) పూర్తిగా నయము చెయ్యాలంటే తొలిదశలలోనే వ్యాధిని పసిగట్టాలి. అంతే కాక కర్కటవ్రణములు రాకుండా జాగ్రత్తపడాలి. కర్కటవ్రణముల నివారణ :

పొగత్రాగుట, పొగాకు నములుట, హెచ్చుగా పోకచెక్కలు నమలుట, జర్దాకిళ్ళీ వంటి  వాడుకలు లేకుండా చూసుకోవాలి. మద్యవినియోగమును చాలా అదుపులో ఉంచుకోవాలి. హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ వ్యాధులు రాకుండా పిన్నవయస్సులోనే H.P.V టీకాలు (Vaccine) వేయించాలి. మితాహారము తీసుకొనుట, శరీరపు బరువును అదుపులో ఉంచుకొనుట, శారీరకవ్యాయామము, కాయగూరలు, పళ్ళు, పూర్ణధాన్యముల వినియోగము పుట్టకురుపులను నివారించుటకు తోడ్పడుతాయి. హెపటైటిస్ బి సోకకుండా టీకాలు వేయించుకొనుట, హెపటైటిస్ సి రాకుండా  తగిన జాగ్రత్తలలో ఉండుట, రేడియో ధార్మికకిరణాలకు గుఱి కాకుండా జాగ్రత్తపడుట కర్కటవ్రణములను వారించుటకు తోడ్పడుతాయి.

పుట్టకురుపులు త్వరితముగా కనుగొని వాటికి సత్వరచికిత్స చేయుట వలన వాటిని నయము చేసే అవకాశము ఉన్నది. ఎవరికి వారు వారి శరీరమును పరీక్ష చేసుకునుట వలన కొన్ని కాన్సరులను త్వరగా గుర్తించవచ్చును. దేహమును, చర్మమును పరీక్షించుకుంటే చర్మముపై కలిగే వ్రణములు కనిపిస్తాయి. అసాధారణపు పుట్టుమచ్చలు కలిగినా, ఉన్న పుట్టుమచ్చలు పెరిగినా, లేక వాటి వర్ణములో మార్పులు జరిగినా, లేక వాటి వలన  దురద, నొప్పి వంటి లక్షణములు పొడచూపినా, లేక వాటి చుట్టూ వలయములు ఏర్పడినా, మరే యితర మార్పులు కలిగినా వైద్యులను

291 ::