పుట:Hello Doctor Final Book.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావచ్చును. జపానుదేశములో జీర్ణాశయపు పుట్టకురుపులు (gastric carcinomas) ఎక్కువయితే అమెరికాలో పెద్దప్రేవుల పుట్టకురుపులు (colon cancers) ఎక్కువ. నా ఆత్మీయులలోను, నెయ్యులలోను పెద్దప్రేవుల కర్కటవ్రణములు చూసాక భారతీయులలో  అంతా అనుకునేకంటె ఎక్కువమందికే  బృహదంత్ర కర్కటవ్రణములు (Colon Cancers) కలుగవచ్చునేమో అనే సందిగ్ధము నాకు కలుగుతున్నది.

అతినీలలోహిత కిరణాల (Ultraviolet rays) వలన చర్మపు పుట్టకురుపులు, మెలనోమాలు (Melanomas) కలుగుతాయి. రేడియో ధార్మికకిరణాలకు (Radio active rays) లోనైతే పుట్టకురుపులు రావచ్చు. ఱాతినార  (Asbestos) వాడే పరిశ్రమల్లో పనిచేసే వారికి శ్వాసకోశపుపొరలో (Pleura) మీసోథీలియోమా (Mesothelioma) అనే కాన్సరు కలిగే అవకాశము ఎక్కువ.

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (Human Papilloma Virus) అనే విషజీవాంశముల వలన  గర్భాశయముఖములలో పుట్టకురుపులు (Uterine Cervical Cancers) కలుగుతాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వ్యాధుల వలన కాలేయపు పుట్టకురుపులు కలుగవచ్చును. హెలికోబాక్టర్ పైలొరై (Heliocobacter pylori) అనే సూక్ష్మజీవుల వలన జీర్ణాశయ కర్కటవ్రణములు (Gastric)  కలుగుతాయి.

వంశపారంపర్యము వలన మూడు నుంచి పదిశాతపు కర్కటవ్రణములు సంభవిస్తాయి. జన్యు వైపరీత్యములతో  బి ఆర్ సి ఎ 1 , 2 (BRCA 1 BRCA 2) జన్యువులు వంశానుగతముగా వస్తే రొమ్ము పుట్టకురుపులు (breast cancers) వచ్చే  అవకాశములు ఎక్కువ.

కర్కటవ్రణములు ప్రమాదకరమైన వ్యాధులు. వాటిని కనుగొన్న సమయానికి అవి ఇతర అవయవాలకు బహుళముగా వ్యాపించకపోతే అవి చికిత్సకు లొంగే అవకాశములు ఉంటాయి. వివిధ అవయవాలకు వ్యాప్తిచెందిన పుట్టకురుపులను పూర్తిగా నయముచేయుట కుదరక

290 ::