పుట:Hello Doctor Final Book.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శక్తి తగ్గి సూక్ష్మాంగజీవుల వలన వివిధ రోగములు కూడా కలుగ వచ్చును కర్కటవ్రణములు కలుగుటకు కారణాలు :

కర్కటవ్రణములు కలుగుటకు  కారణము కణముల జన్యువులలో మార్పు రావటమే కదా! ఈ జన్యు వ్యత్యాసము తొంబయి శాతము, కణములపై పరిసరముల ప్రభావము వలన జరిగితే ఒక పదిశాతము వరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువుల వలన కలుగుతాయి. వృద్ధాప్యములో శరీర వ్యాధినిరోధక శక్తి తగ్గి అసాధారణ కణములు తొలగింపబడవు. ఆ కణాలు వృద్ధిచెందుట వలన పెరుగుదలలు పొడచూపుతాయి. పొగత్రాగుట, యితర విధాల పొగాకు వినియోగము, ఊబకాయము, వ్యాయామలోపము, సూక్ష్మజీవులు కలిగించే వ్యాధులు, ఆహారపుటలవాట్లు, వాతావరణ కాలుష్యము, రేడియో ధార్మికకిరణాల వంటి  భౌతిక కారణాలు అవయవాల కణములను ప్రభావితము చేస్తాయి.

పొగత్రాగుట, పొగాకు వినియోగములు 25 శాతపు పుట్టకురుపులకు కారణము. తొంబైశాతపు శ్వాసకోశ కర్కటవ్రణములు (Lung Cancers) పొగత్రాగే వారిలోనే సంభవిస్తాయి. మూత్రాశయ కర్కటవ్రణములు (Urinary bladder cancers), మూత్రాంగముల కర్కటవ్రణములు (Kidney cancers), స్వరపేటికలో వచ్చే కర్కటవ్రణములు (Laryngeal cancers) అధికశాతములో పొగత్రాగే వారిలోనే కలుగుతాయి. జీర్ణాశయము (Stomach), క్లోమము (Pancreas), కంఠము, అన్ననాళములలో (esophageal cancers) పుట్టే  పుట్టకురుపులు పొగత్రాగే వారిలోనే ఎక్కువ. పొగాకులలో నైట్రోసమైన్లు (Nitrosamines), పోలీసైక్లిక్ హైడ్రోకార్బనులు (Polycyclic Hydrocarbons) అనే కర్కటవ్రణజనకములు (Carcinogens) ఉంటాయి.

    పొగాకు నమిలేవారిలోను, పోకచెక్కలు విరివిగా నమిలేవారిలోను నోటిలో కాన్సరులు ఎక్కువగా వస్తాయి. కాలుతున్న అంచు నోటిలో పెట్టి చుట్టలు కాల్చేవారిలో (విశాఖ, శ్రీకాకుళపు ప్రాంతాలలో యీ  అడ్డపొగ అలవాటు ఉన్నది.) అంగుట్లో కర్కటవ్రణములు (palatal cancers)

289 ::