పుట:Hello Doctor Final Book.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26. కర్కట వ్రణములు ( Cancers ) శరీరానికి కలిగే రుగ్మతలలో కొత్త పెరుగుదలలకు (Growths) ప్రాముఖ్యత ఉన్నది. ఈ పెరుగుదలలు నెమ్మదిగా పెరిగే నిరపాయకరమైన బోళా గడ్డలు (Benign tumors) కావచ్చును. త్వరితముగా పెరిగి పరిసర కణజాలముల లోనికి మూలములతో ఎండ్రకాయలవలె చొచ్చుకుపోయే ప్రమాదకరమైన కర్కటవ్రణములు (Malignant tumors) కావచ్చును. ఇవి కాన్సరులుగా అందుకే ప్రాచుర్యములో ఉన్నాయి. ఈ పెరుగుదలలు పుట్టలవలె పెరుగుట వలన వీటిని పుట్టకురుపులు అని కూడా అంటారు.

కణముల జన్యువులలో ( genes ) మార్పు జరుగుటవలన (Genetic Mutations) ఆ కణములు అతిత్వరగా పెరుగుతూ, అతిత్వరగా విభజన చెందుట వలన ఈ పెరుగుదలలు కలుగుతాయి. కర్కటవ్రణములలో కణములు పూర్తిగా ఆయా అవయవ కణజాలములలోని కణములవలె పరిపక్వత చెందవు. అందుచే అవి ఆ అవయవాల కణములను పోలి ఉండవు. ఈ కణాలలో న్యూక్లియస్ పరిమాణము హెచ్చుగా ఉండి, సైటోప్లాజము పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ కణాల మధ్య సంధానము కూడా తక్కువగా ఉంటుంది. పరిపక్వత పొందకపోవుటచే ఈ కణాలు ఆ యా అవయవ ధర్మాలను నిర్వర్తించవు. ఈ కణ బీజములు రసినాళముల (lymphatics) ద్వారా రసిగ్రంథులకు (lymph glands), రక్తనాళముల ద్వారా యితర అవయవములకు వ్యాప్తి చెందగలవు. ఈ కర్కటవ్రణాలు త్వరగా పెరుగుతూ పోషకపదార్థాలను విరివిగా సంగ్రహించుట వలనను, ఈ వ్రణముల నుంచి విడుదల అయ్యే రసాయనపదార్థముల వలనను, ఆకలి క్షీణించుట చేతను  బరువు తగ్గి దేహక్షయము కలుగుతుంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ఆ అవయవ వ్యాపారములకు ప్రతిబంధకము కూడా కలుగజేస్తాయి. ఈ పుట్టకురుపులు చివరి దశలలో ఉన్నప్పుడు శరీర వ్యాధి నిరోధక

288 ::