పుట:Hello Doctor Final Book.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యుత్ ప్రేరణ మూర్ఛచికిత్స ( Electro Convulsive Therapy ) :

ఔషధములకు లొంగని వ్యాధులకు, మానసిక చలనమాంద్యము (Psychomotor retardation) తీవ్రముగా ఉన్నపుడు, ప్రాణాపాయ పరిస్థితులలోను, మందులకు లొంగని మానసికవ్యాధులకు విద్యుత్ ప్రేరణ మూర్ఛచికిత్స పూర్తిగా మత్తుమందు ఇచ్చి చేస్తారు. ఈ చికిత్స పలు పర్యాయములు చేయవచ్చును. సత్ఫలితములు కలిగినవారిలో సంవత్సరములో ఏబది శాతపు మందిలో వ్యాధి లక్షణములు మరల కనిపించవచ్చును.

ఈ భూమిపై జన్మించిన వారందఱూ అదృష్టవంతులు కారు. మనోవ్యాధికి గుఱైనవారు బంధు, మిత్ర, సహచరులలో ఉంటే వారి వ్యాధులను అర్థము చేసుకొని వారికి బాసటగా నిలిచి, వారి చికిత్సకు తోడ్పడాలి. సమాజము, ప్రభుత్వము కూడా చికిత్స బాధ్యత తీసుకోవాలి.

287 ::