పుట:Hello Doctor Final Book.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2.

3. 4.

5. 6.

(citalopram) మొదలైనవి.

సీరోటోనిన్ నారెపినెఫ్రిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు, (SNRIs) : వెన్లఫాక్సిన్ (venlafaxine), డులోక్సిటిన్ (duloxetine), డెస్వెన్లఫాక్సిన్ (desvenlafaxine) మొదలైనవి.

నారెపినెఫ్రిన్ డోపమిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు (NDRIs) ఉద : బ్యుప్రోపియాన్ (bupropion). ట్రైసైక్లిక్ ఏంటి డిప్రెసెంట్లు   (Tricyclic antidepressants): ఎమిట్రిప్టిలిన్ (amitriptyline), నార్ ట్రిప్టిలిన్ (nortriptyline), డెసిప్రమిన్ (desipramine) మొదలైనవి. మొనోఎమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్లు (Monoamine Oxydase Inhibitors).

టెట్రాసైక్లిక్ ఏంటి డిప్రస్సెంట్లు (Tetracyclic Antidepressants): ఉద ; మిర్టజపిన్ (mirtazapine), సాధారణంగా వాడే మందులు.

వాడే మందుల మోతాదులను సవరించుట, దుష్ఫలితములను గమనించుట, వ్యాధిగ్రస్థులను అవసరము బట్టి జాగ్రత్తగా గమనించుట వైద్యుల బాధ్యత. సామాన్య వైద్యులు (General Doctors) చికిత్సకులైతే అవసరమైనపుడు నిపుణులను సంప్రదించాలి. ద్విధ్రువవ్యాధికి (Bipolar disorder) దిగులు మందులు కుదరవు. మానసికవేత్తల సలహా చికిత్సకు తోడుగా, మానసికస్థితిని కుదుటపరచే  (Mood Stabilisers)  లిథియమ్ (Lithium); వేల్ప్రోయిక్ ఏసిడ్ (Valproic acid), లామిక్టాల్ (Lamictal) టెగ్రటాల్ (Tegretol), వంటి మూర్ఛమందులు; ఒలాంజపిన్ (Olanzapine), రిస్పెరిడోన్ (Risperidone) వంటి అసాధారణ మానసిక ఔషధములు (Atypical antipsychotics) ద్విధ్రువవ్యాధికి వాడుతారు. ఆందోళన ఎక్కువైనవారికి ఆందోళన తగ్గించే మందులు వాడుతారు. మానసికవ్యాధులకు కొత్తమందులు లభ్యమగుట చక్కని పరిణామము.

286 ::