పుట:Hello Doctor Final Book.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిండ్రోము (Cushing syndrome) వంటి వినాళగ్రంధి వ్యాధులు వలన, విటమిన్ బి 3 (నయాసిన్) లోపము వలన వచ్చే పెల్లాగ్ర  (pellagra) అనే వ్యాధి వలన, మానసిక ప్రవృత్తులలో మార్పులు కలుగవచ్చును.. చికిత్సలు :

మానసిక వ్యాధులను తేలికగా తీసుకొని, నిర్లక్ష్యము చేయుట మంచి విషయము కాదు. ముందుగానే వ్యాధిగ్రస్ల థు పై కాని, వ్యాధులపై కాని, చికిత్సలపై గాని సరియైన అవగాహన లేక స్థిరాభిప్రాయములు  ఏర్పఱచుకొనుట తగదు. మానసికశాస్త్రము, మానసికవ్యాధుల శాస్త్రము దినదినము పరిణతి చెందుతునే ఉన్నాయి. పూర్తిగా నివారించలేకపోయినా యీ వ్యాధులను అదుపులో ఉంచవచ్చును. విషాదవర్తన కలిగిన వారికి కుటుంబసభ్యుల, మిత్రుల, సహచరుల అవగాహన, ఆదరణ, ఆలంబనము, భరోసా చాలా అవసరము. దిగులు స్వల్పకాలము, పరిమితముగా ఉన్నప్పుడు చికిత్సలు అవసరము కాక పోవచ్చును. దిగులు అధికమైనా, ఆత్మహత్య లక్షణాలు ఏ మాత్రము కనిపించినా అత్యవసర చికిత్సలు అవసరము. దీర్ఘ కా ల విషాదమునకు, దీర్ఘ కా ల  ఆందోళనకు, పెనుదిగులుకు, ద్విధ్రువవ్యాధులకు చికిత్సలు అవసరము. పిచ్చి (Schizophrenia) గలవారికి చికిత్స తప్పనిసరి. మనస్తత్వవేత్తలు (Psychologists), మనోవ్యాధివైద్యులు (Psychiatrists) యీ వ్యాధులకు సాధారణముగా చికిత్సలు చేస్తారు. స్మృతివర్తన చికిత్సల (Cognitive Behavioral Therapy) వంటి చికిత్సలతో వారి ఆలోచనలను, బాహ్యప్రేరణలను ఏ విధముగా ఎదుర్కొని స్పందించాలో శిక్షణ గఱపుతారు. వ్యాయామము, యోగాభ్యాసములు, కొంత తోడ్పడవచ్చును. మందులు : 1.

అవసరమైనపుడు దిగులు చికిత్సకు ఔషధములను వాడుతారు. ఇవి :

సెలెక్టివ్  సీరోటోనిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్లు ( Selective Seotonin Reuptake Inhibitors SSRI s) :(ఫ్లుఆక్సెటిన్ ( fluoxetin ), పెరాక్సిటిన్ ( paroxetin ), సెర్ట్రలిన్ ( sertralin ), సిటలోప్రమ్

285 ::